Skip to main content

సీ గానపెసూనాంబ - ఓ దక్షిణ

 నేను ముళ్ళపూడి వెంకట రమణ గారి అభిమానిని. ఎంత అభిమానినో చాలా, బాగా, గొప్ప అని విశేషణలు చేర్చలేనంత. అభిమానం అనుభవించడంలోనే తెలుస్తుంది మనమెంత అభిమానో. 

చదువుకునే రోజుల్లో వారి రచనలు చదివి వాటిల్లోని కొన్ని పదాలను పదేపదే వల్లించుకుంటూ ఉండేవాళ్ళం. విజయా వారి సినిమాల తర్వాత ప్రజల చేత విశేషంగా సంభాషణలను వల్లె వేయించిన సినిమా ముత్యాలముగ్గు. ఆ ఘనతంతా ముళ్ళపూడి గారికే. ఇప్పటికీ ఆ తరం వాళ్ళ నాలుక చివర్న అవి ఉన్నాయి.

ఇహ బుడుగు విషయానికొస్తే అదో సంచలనం. పుస్తకాన్నెక్కిన ముళ్ళపూడి బాల్యం. అమూల్యం. ఆయన ఇరవై ఏళ్ళ వయసప్పుడే బురుగుని కన్నాడు. ఆ బుడుగుకు దృశ్యరూపం ఇచ్చింది బాపూ. అల్లరికో తెలివితేటలకో మాటకారితనానికో ఓ బ్రాండు అంబాసిడర్ . ప్రతి తల్లిదండ్రీ వాళ్ళ అబ్బాయిని బుడుగుగా చెప్పుకోడం ఒక క్రెడిబిలిటీ, అసలు వాళ్ళ పిల్లడిలో అంత విషయం ఉన్నా లేకున్నా. ముళ్ళపూడి వారి "బుడుగు" సీరియల్ గానూ, పుస్తకంగానూ ఎన్నో ఇళ్ళు చుట్టేశాడు. కొన్నిళ్ళు మళ్ళీ మళ్ళీ నూ. అట్లాంటి బుడుగు నన్నూ బాగా ఆకర్షించాడు. అదే కాదు కొన్ని సందర్భాల్లో బుడుగు భాషే మాట్లాడించాడు. దాని వల్ల నాకేదో ఐక్యూ బాగావుంది అనుకునే అపార్ధాన్ని మూటకట్టించాడు.


బురుగు సీ గానపెసూనాంబని బాగా ఇప్టపడతాడు. బురుగేంటీ ప్రతి తల్లి ఇష్టపడే రూపం గుణం పెసూనాంబకి ఇచ్చారు బాపూ రమణలు. బుడుగు కథలో గానపెసూనాంబ ఓ పిల్లతెమ్మెరలా మాత్రమే వస్తుంది. కానీ మనసు దోచేస్తుంది. అలాగే నా మనసూ దోచేసింది. ఆ ఇష్టమే బురుగు కథలో గానపెసూనాంబకి దొరకాల్సినంత చోటు దొరకలేదన్పించింది. నాకు తనే ఆ గోడు చెప్పుకున్నంతగా ఆలోచనలకు బందీ అయ్యాను. 

ఆ మథనమే దాని ఫలితమే ఈ సీ గానపెసూనాంబ రాతలు. ఇవి ముళ్ళపూడివారి బుడుగు సౌరభాన్ని మరోసారి గుర్తుచేసుకునేందుకే తప్ప మరే ఫలమూ ఆశించి కాదు.

నాది ధిక్కారం కాదు, అహంకారం అంతకన్నా కాదు. బుడుగు భాషంటే మమకారం అంతే. ఇంకేం కాదు.


ఇది పొగరో తప్పో తెలియదు ముళ్ళపూడి వారి పాత్రకు నేను సొబగులు అద్దాలనుకోడం. ఇందులో నా గొప్పేం లేదు. పాత్ర వారిదే, భాష వారిదే, సందర్భాలూ అప్పటివే. పయనమొక్కటే నా ఊహ, భావుకతా. 

నా ప్రయత్నం పలువురిని అలరించడం నే చెసిన సాహసాన్ని సమర్ధించుకునేందుకు ఉపయోగం.


ముళ్ళపూడి వారి మీద ఉన్న అఖండ అభిమానంతో వారి తొంభైయ్యవ జన్మదిన సందర్భంగా ఆయనను తలుచుకుంటూ నా సీ గానపెసూనాంబను 15 కథనాలను కానుకగా వారికి సమర్పించుకుంటున్నాను.


ఈ ఏకలవ్య శిష్యుడికి ఆయన వేసే ఏ శిక్ష అయినా సమ్మతమే.


( రా. శా. )

ఇంకో వెంకట్రమణ

Comments

Popular posts from this blog

మృత్యువు కు చెక్

MMTS కధలు మృత్యువు కు చెక్ : చందానగర్ స్టేషన్ లో నేను ఎక్కాల్సిన MMTS బండి వచ్చి ఆగింది. టైమ్ చూసుకుంటూ బోగీ దగ్గరకి నడిచాను. బండి పావుగంట ఆలస్యం. ఇంకెక్కడా ఆలస్యం అవకుండా బండి నడిస్తే ఆఫీసుకు అయిదు నిముషాలు ముందు చేరుకుంటాను. లేదంటే బాసు పెట్టే నోటి వాతలకి సిద్దంగా ఉండాలి. అవును మరి, రచయిత జంధ్యాల గారికి కూడా తట్టని తిట్లు తిట్టగలడు మా బాసు. అంత కొత్తగా వేడిగా పడేవి మరి నోటి వాతలే కదా!  శరీరం మీది మామూలు వాతలైతే అంగీతోనో, పాంటు తోనో దాచుకోవచ్చు. కానీమా బాసు పెట్టే సెటైరిక్ శాడిస్టు నోటివాతలు, రెండు బదిలీల మీద రెండు ఆఫీసులు మారినా మర్చిపోలేం! బోగిలోకి ఎక్కి చక్రవర్తి కోసం చూసాను, ఎక్కడ ఉన్నాడా? అని. కన్పడలేదు. చక్రవర్తి MMTS బయల్దేరే స్టేషన్ లింగంపల్లిలో ఎక్కుతాడు. తనప్రక్క సీటు నా కోసం ఆపి ఉంచుతాడు. ఇద్దరం ఒకే ఆఫీసు అవడంతో మా MMTS పయనం రోజూ మూడు యధార్ధాలు, ఆరు పుకారుల కబుర్లతో నడిచి పోతోంది. ఎప్పుడైనా ఎవ్వరం సెలవు పెడుతున్నా రెండో వాళ్ళకి చెప్పుకుంటాం. “ ఈ రోజు ఏమైంది తనకి” అనుకుంటూ ఖాళీగా కనబడ్డ సీటులోకి శరీరాన్ని చేర్చాను. “మీ బెటర్ హాఫ్ ఏడి సర్ , కనబడ్డం లేదు?” -...

తన శాంతమె తనకు శిక్ష!

తన శాంతమె తనకు శిక్ష! పదేళ్ళ క్రితం: "ప్రభా, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సరిపడ డబ్బులున్నాయ్ ! మీ అమ్మగార్ని వచ్చి మనతో ఉండమనచ్చు కదా! అక్కడ ఒక్కరెందుకూ" భార్య యమున తన మనసులో మాట అన్నది భర్త ప్రభాకర్ తో. వెంటనే అమ్మకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకర్ . "మొన్ననే కదరా మీ పెళ్ళయింది. కొత్త కాపురంలో నేనెందుకురా పానకంలో పుడకలా" త్రోసి పుచ్చింది తల్లి. ****** తొమ్మిదేళ్ళ క్రితం: " ప్రభా, మనం ఈ బెడ్ రూమ్ మీ అమ్మ గారికే ఉంచుదాం. మిగిలిన దాన్లోనే మనం సర్దుకుందాం. అత్తయ్య గారికి చెప్పండి వచ్చేయమని మన దగ్గరకి" యమున తన ఆలోచన పంచుకుంది భర్తతో. " అదే చెప్పాను అమ్మతో. తొందరే ముందిరా? వస్తాన్లే అంటోంది" ప్రభాకర్ వివరణ భార్యకి. ****** ఎనిమిదేళ్ళ క్రితం: "ప్రభా మన చంటి దానికి సంబంధించిన వన్నీ మీ అమ్మగారి కోసం ఉంచిన గదిలో పెడుతున్నాను. ఆమె వచ్చినప్పుడు ఖాళీ చెస్తాను. మళ్ళీ అడగ రాదూ వస్తారేమో!" యమున. " అడిగాను. మొన్ననే పాప పుట్టింది కదరా, ఖర్చులు పెరుగుతుంటయ్ మీకు. మళ్ళీ ఆలోచిద్దాంలే అక్కడకి రావడం గురించి అంది అమ్మ" ప్రభాకర్ తెలిపాడు. ****** ఏడేళ్...
కిర్  కిర్   తలపులు నియమం: వ్రతాలు, రోజాలు, సువార్త కూటములు - ఆన్నింటిలో వ్యాపకం ఒకటే భజించడం .... దాగిఉందొక మూల వ్యాపకం తదుపరి భుజించడం