Skip to main content

Posts

Showing posts from October, 2019

హెర్క్యూలెస్

హెర్క్యూలెస్ : “ఇదుగోండి… మీ అపురూపం. ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి కొత్త ఇంట్లో” అంటూ సారధి చేతిలో పాత సైకిల్ బెల్ పెట్టేసి వెళ్ళింది అతని భార్య వకుళ. చేతిలో ఉన్న బెల్ ని ఎదురుగా ఉన్న టీపోయ్ మీద పెట్టాడు. తళ తళ మెరుస్తోన్న ఇత్తడి సైకిల్ బెల్ ! అది అతనికి ఎంతో అపురూపం. ఆ సంగతి ఆ ఇంట్లో అందరికీ తెల్సు. అందుకే కొత్తగా మారిన సొంత ఇంట్లో దాన్ని ఎక్కడ భద్రపరచుకుంటాడో తన ఇష్టం అని వకుళ ఆలోచన. సారధి ఆ బెల్ వంకే తదేకంగా చూస్తున్నాడు. అది వాళ్ళ నాన్న వాడిన సైకిల్ - హెర్క్యూలెస్ ది. సైకిల్ ముందు, వెనక చక్రాల మీద ఉండే మడ్ గార్డ్ ల మీద హెర్క్యూలస్ కంపెనీ లోగో -భూగోళాన్ని తన భుజాల మీద మోస్తూన్న ఓ మహాబలుడు. దర్శకుడు రాజమౌళి చిన్నప్పుడు వాళ్ళింట్లో కూడా  ఈ హెర్క్యూలెస్ కంపెనీ సైకిల్ ఉండి ఉంటుంది! నిజాయితీగా ఒప్పుకుంటే, బాహుబలిలో ప్రభాస్ చేత శివలింగం భుజాలమీద మోసే సన్నివేశానికి ప్రేరణ ఇదే కావచ్చు! ఆ సైకిల్ నాన్నకి తను పనిచేసే కంపెనీ వాళ్ళు ఇచ్చినది. మొదట అది కంపెనీ వాళ్ళదే! కొన్ని సంవత్సరాల తర్వాత కంపెనీ వాళ్ళు వేసిన వేలంలో వాళ్ళ నాన్న దాన్ని సొంతం చేసుకున్నాడు! అప్పటి నుండి అది సారధి...

ఆచారం లో ఒౌచిత్యం:

ఆచారం లో ఒౌచిత్యం: "అరేయ్ వ్యాసా... , రేపు సోమవారం నుండి మహళాయ పక్షాలట, అమ్మ చెప్పమంది. నాన్న పోయిన తిధి - ద్వాదశి. గుర్తు పెట్టుకొని వీలైతే ఆ తిధి నాడు, లేకపోతే ఆ పక్షం రోజుల్లో నీకు కుదిరిన ఏదో ఒకరోజు తర్పణాలు విడవమంది. మర్చిపోకు " అక్కాయ్ గొంతు ఫోన్లో అమెరికా నుండి.  అమ్మ తన దగ్గరే ఉంటోంది రెండు నెలలుగా. వెళ్ళే ముందు ఒకరోజు చెప్పింది - " దసరా శరన్నవరాత్రులకు ముందు మహళాయ పక్షం వస్తుంది, తప్పకుండా పితృ దేవతలకి తర్పణాలు వదలాలి. మర్చిపోకు." ఈ పెద్దవాళ్ళకి పనేం ఉండదు, ఇట్లాంటివన్నీ గుర్తు పెట్టుకొని మరీ మన బుర్రలోకి వదులుతుంటారు. అది అయ్యేదాకా మనకు శాంతి ఉండదు, వాళ్ళకు నిద్దరుండదు! నా మస్తిష్కం లో చిన్న మూలుగు. నిజమే! తను మర్చి పోయాడు. వెతికితే కారణాలు వరస కట్టి నుంచుంటాయ్ ! వాటిల్లో - వీటి మీద తన కంత నమ్మకం లేక పోవడం కూడా ఒకటిగా కనబడచ్చు! కొంత వరకు కారణం ప్రాముఖ్యత పూర్తిగా తెలియక, లేక సరైన లాజిక్ తెలియక. అంతే కాకుండా అన్నింటికీ ముందుగా అన్పించేది - అంత టైమ్ ఎక్కడుంది మనకి? అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు! అంతా పరుగు మయం! "కానీ నాన్నకు మాత్ర...