Skip to main content

Posts

Recent posts

AP 11 Z 2020 ( అరపేజీ కథ )

  AP 11 Z 2020 ( అరపే జీ కథ ) మధ్యాహ్నం 4.00 గంటలు: కాకినాడ బస్సు ప్రాంగణం నుండి హైదరాబాదు వెళ్ళే AP 11 Z 2020 ఆర్టీసి బస్సు బయల్దేరింది. దసరా పండుగ సందర్భంగా ప్రజా సౌకర్యార్ధం వేసిన ఈ ప్రత్యేక బస్సు, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, కోదాడ, సూర్యాపేట మీదగా పయనించి తెల్లవారుఝామున 4.00  గంటలకి హైదరాబాదు చేరుకుంటుంది. సాయంత్రం 5.00 గంటలు: పండుగ సందర్భంగా భార్యా పిల్లలతో సొంత ఊరు రాజమండ్రికి వచ్చిన కామేశ్వర్రావు, నిజానికి ఇంకో మూడు రోజుల తర్వాత తిరుగు ప్రయాణం కట్టాలి! కానీ, ఆఫీసు నుండీ వచ్చిన అత్యవసర సమాచారంవల్ల, భార్యా పిల్లల్ని మూడురోజుల తర్వాత రమ్మని తను మాత్రం బయల్దేరి రాజమండ్రి బస్సు ప్రాంగణం చేరుకున్నాడు. అత్యవసరంగా బయల్దేరడం వల్ల రిజర్వేషను లేక ఏ బస్సులో ఖాళీ ఉంటే దాన్లో ఎక్కవల్సిన పరిస్థితి. బస్టాండుకు వచ్చాక విచారిస్తే రాజమండ్రి నుండీ బయల్దేరే ఏ బస్సులోనూ సీట్లు ఖాళీ లేవనీ, పైనుండీ వచ్చే బస్సుల్లో దేన్లోనైనా సీటు దొరికితే ఎక్కవచ్చనీ తెల్సింది. కాకినాడ నుండీ వచ్చిన ప్రత్యేక బస్సు AP 11 Z 2020 లో ఉన్న రెండు ఖాళీ సీట్లలో ఒకటి కామేశ్వర్రావు సొంతమయ్యింది. సూట్ కేసు సీటు పైన ఉన్న వసత...

ఆతిధేయం

అది అండమాన్ దీవుల్లోని ఒక చిన్న దీవి. ముఖ్యపట్టణం పోర్టు బ్లేయర్ నుండి రెండు గంటల ప్రయాణం. ఊరు అనుకునేంత పెద్దది కూడా కాదు. అది ఒక వినోద విహార యాత్రా స్థలం. అక్కడ నివాసం ఉండేది అరవై నుండి డెభై కుటుంబాలే. కొంతమంది బెంగాలీలు, మరికొంత మంది తెలుగు శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల కుటుంబాల వారు.  తొంభై శాతం యాత్రికులు పోర్టుబ్లేయర్ నుండి ప్రొద్దున వచ్చి సాయంత్రం తిరిగి వెళ్ళిపోతుంటారు. అక్కడి వాటర్ స్పోర్ట్స్ చాలా ప్రాముఖ్యం. ఇంకో కారణం - అక్కడి సముద్ర తీరం పటిక వేసి తేర్చిన నీరులా స్పష్టంగా, కాలుష్య రహితంగా ఉంటుంది! యాత్రికులే ఆ దీవికి వరం, జీవం. సంవత్సరంలో జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉండే వర్షాకాలంలో అక్కడ యాత్రికుల సంచారం ఉండదు! ఏడు నెలలు కష్టపడి సంపాదించేది ఆ అయిదు నెలలు బ్రతికి ఉండడానికే! యాత్రికుల సేవే పరమార్ధంగా జీవనం అక్కడి వాసులకి. వారి మాటల్లో వేదాంతం, సేవల్లో అంకిత భావం యాత్రికులకు హత్తుకుపోతాయి. కొద్ది గంటల విహారం కోసం వచ్చే వారికి ఆహ్లాదాన్ని కలగజేయడమే వారి వృత్తి.  కానీ సంవత్సరంలో రెండు మూడు సార్లు వచ్చే తుఫాన్లే ఆ దీవికి శాపం! ఒక్కో తుఫాను ఒక్కో  విషాదాన్ని మిగుల్చుత...

తన శాంతమె తనకు శిక్ష!

తన శాంతమె తనకు శిక్ష! పదేళ్ళ క్రితం: "ప్రభా, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సరిపడ డబ్బులున్నాయ్ ! మీ అమ్మగార్ని వచ్చి మనతో ఉండమనచ్చు కదా! అక్కడ ఒక్కరెందుకూ" భార్య యమున తన మనసులో మాట అన్నది భర్త ప్రభాకర్ తో. వెంటనే అమ్మకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకర్ . "మొన్ననే కదరా మీ పెళ్ళయింది. కొత్త కాపురంలో నేనెందుకురా పానకంలో పుడకలా" త్రోసి పుచ్చింది తల్లి. ****** తొమ్మిదేళ్ళ క్రితం: " ప్రభా, మనం ఈ బెడ్ రూమ్ మీ అమ్మ గారికే ఉంచుదాం. మిగిలిన దాన్లోనే మనం సర్దుకుందాం. అత్తయ్య గారికి చెప్పండి వచ్చేయమని మన దగ్గరకి" యమున తన ఆలోచన పంచుకుంది భర్తతో. " అదే చెప్పాను అమ్మతో. తొందరే ముందిరా? వస్తాన్లే అంటోంది" ప్రభాకర్ వివరణ భార్యకి. ****** ఎనిమిదేళ్ళ క్రితం: "ప్రభా మన చంటి దానికి సంబంధించిన వన్నీ మీ అమ్మగారి కోసం ఉంచిన గదిలో పెడుతున్నాను. ఆమె వచ్చినప్పుడు ఖాళీ చెస్తాను. మళ్ళీ అడగ రాదూ వస్తారేమో!" యమున. " అడిగాను. మొన్ననే పాప పుట్టింది కదరా, ఖర్చులు పెరుగుతుంటయ్ మీకు. మళ్ళీ ఆలోచిద్దాంలే అక్కడకి రావడం గురించి అంది అమ్మ" ప్రభాకర్ తెలిపాడు. ****** ఏడేళ్...

ఘంటసాల - బాలూ

ఘంటసాల - బాలూ  ఇద్దరూ స్వయంకృషి తో వచ్చినోళ్ళే ఇద్దరూ తెలుగు మట్టి బొమ్మలే ఇద్దరూ వారాల బిక్షువులే  ఇద్దరి జీవితం సినీమాతోనే  ఇద్దరి జీతం సినీ గీతమే ఇద్దరికీ పద్మ అవార్డులు ఇద్దరి అర్ధాంగులూ సావిత్రులే ఇద్దరి చివరి మజిలీ చెన్న పట్నమే! వాళ్ళని పరిచయం చేసింది పాట! వారి బ్రతుకు పాట వారి మాట పాట వారి నడక పాట వారి నడత పాట వారి వశం పాట వారి పాశం పాట వారి ఊపిరి పాట వారి గమనం పాట వారి మననం పాట వారి ఆహారం పాట వారి ఆహార్యం పాట వారి అర్ధం పాట వారి పరమార్ధం పాట వారి సామ్రాజ్యం పాట వారి సాయుజ్యం పాట వాళ్ళని రగిల్చింది - వాళ్ళని మిగిల్చింది - పాట గదరా శివా! తెలుగు సినీ గీతానికి ఘంటసాల పల్లవి అయితే, ఎస్ పీ చరణం కదా!  తెలుగు సినీ భాగవతంలో ఘంటసాల రాముడైతే, బాలూ కృష్ణుడు! వారిద్దరి మధ్య మాటా మంతీ సాగితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందనుకుంటే ఎలా ఉంటుంది!! దానికి తెర తీస్తే ….. రావయ్యా అప్పదాసూ….  ఎవరో అనుకోని అతిథి వస్తున్నాడన్నారు. ఎవరా అనుకుంటుంటే నీ అకాల ఆగమనం.  అప్పుడే నీకు పాటలు చెల్లి పోయాయంటే బాధన్పిస్తుందయ్యా! రా కూర్చో! (క్రింద కూర్చోబోతుంటే)- ఇక్కడ … ఈ సీటు నీది. మీతో సమాన...