Skip to main content

Posts

Showing posts from August, 2017

కిర్ కిర్ తలపులు

కన్య - కుమారి : అమ్మ చెప్పింది …. మాట్లాడు మగాళ్ళతో వాళ్ళ మాటలు “ పక్క ” దారి పట్టనంత వరకు స్నేహ గుణం : గడియారం కొట్టుకుంటోంది …. గుండేె కొట్టుకుంటోంది . రెంటికీ ఒకటే స్నేహ గుణం - చెప్పా పెట్టకుండా .... ఆగి పోవడం ఆగిన చక్రం : వాన ముందా ? చెట్టు ముందా ? వానొస్తే చెట్టు పెరుగుతుంది చెట్టు పెరిగితే వానొస్తుంది తిరిగే ఈ చక్రం మధ్యలో   గొడ్డలి ఎక్కడ నుంచొస్తోంది పోరాటం : “ నిజం ” కి ధైర్యం ఎక్కువ ఎప్పుడూ   ఒంటరి పోరాటమే “ అబద్దం ” పిరికిది పదిమందిని వెంటేసుకు తిరుగుతుంది వేటగాళ్ళు : మనిషి - ౘఋస్తున్నాడు తొడ వలలో చిక్కుకున్న మృగాన్ని చూసి దోమ - చేస్తోంది బల్లే .. బల్లే .. తెరలో దాక్కున్న మనిషిని చూసి కనబడుట లేదు : నా కవలలు సంతోషం - సంతృప్తి తప్పి పోయాయి వెతకడం మొదలెట్టాను కొండల్లో , కోనల్లో , స్టార్ హోటళ్ళలో , రిసార్టుల్లో , బజార్లలో , షాపింగ్ మాలుల్లో , గుళ్ళల్లో , గోపురాల్లో ప్రకటించాను   ఉన్నదంతా ఇచ్చేస్తానని నా కవలల్ని నాక...