Skip to main content

Posts

Showing posts from January, 2018

మేడ మీది అబ్బాయ్ - Cinema Review

మేడ మీది అబ్బాయ్ - Cinema Review నిన్ననే release అయిన ఈ film చూడాలనిపించడానికి కారణం - ముఖ్యంగా cinema title. Title, ఓ తాసిల్దారుగారమ్మాయి , పక్కింటమ్మాయి , సీతారామయ్యగారి మనుమరాలు, లాగా సరళంగా family sentiment పండించేదిలా ఉండడంతో, అమ్మయ్య గుండెనొప్పొచ్చే సీన్లు, కలలో కూడా తరిమే fights, Sumoలు ఎగరడాలు, అరటిచెట్టు మొదలంటా నరికినట్టు నరుక్కోడాలు, హీరో ఎగిరి ఎగిరి తన్నడాలు ఉండవని చిన్న gamble చేసాను. ( హీరో చుట్టూ పొట్టి పొట్టి బట్టలేసుకున్న తెల్లజాతి స్త్రీలున్న poster కూడా కన్పడలేదులేండి ) నా gamble పని చేసింది - Director ఆ పేరు పెట్టడానికి కారణం తప్ప మిగిలినవన్నీ దొరికాయ్ . Family cinema ఇష్టపడే వాళ్ళని theatre వరకు లాగడానికి మాత్రమే ఆ పేరు పెట్టి ఉంటే Director ఆ విషయంలో success అయినట్టే , పైగా హీరో అల్లరి నరేష్ . సినిమా మొత్తంలో ఒకసారి మాత్రం నరేష్ చేత “మేడ మీది అబ్బాయ్ ని” అని చెప్పించి ఆ title సమర్ధించాననుకున్నాడు. ఇతర తారాగణంలో హైపర్ ఆది, అవసరాల ముఖ్యులు. హీరో హీరోయిన్ల మధ్య  ఒక్క యుగళ గీతం కూడా అవసరం లేదు కాబట్టి అందాలు ఆరబోసే వాళ్ళని వద్దను కొని కొత్త అమ్మాయిని పరిచయం చ...

MMTS కధలు: ముక్కలైన ముచ్చట

MMTS కధలు: ముక్కలైన ముచ్చట “ ఏంటీ! ఈ షర్ట్ వేసుకొని ఆఫీసుకు వెళ్ళమంటావా” నా భార్య బయట పెట్టి ఉంచిన చొక్కా చూసి “అరుపు” అనిపించేంత గొంతుతో అడిగాను. “దానికేమైంది? కొత్తదైతేనూ పైగా” అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చింది వంట గది లోనుండి. “అది ఆఫీసుకు మాత్రం వేసుకెళ్ళనని ముందే చెప్పానుగా!” వేరే చొక్కా కోసం వెతుకుతూ అన్నాను. “ ఇంతలో మీకేమయి పోదుగానీ ఇవాల్టికి వేసు కెళ్ళండి. కొన్ని ఉతకడానికి ఉన్నయ్ , కొన్ని ఇస్త్రీకి ఉన్నయ్ “ ఒక అధికారి లాగా చెప్పేసి వెళ్ళి పోయింది. ఆ చొక్కాని రెండు నెలల క్రిందట నా పుట్టిన రోజుకు తనే స్వయంగా వెళ్ళి ఒక మాల్ లో కొనుక్కొచ్చింది. లినెన్ టెక్స్ఛర్ లో మంచి బ్రాండెడ్ కంపెనీది. అంతా బాగనే ఉంది, రంగే - ఎర్రటి ఎరుపు. నాకు నప్పదు అని నా అభిప్రాయం. పుట్టిన రోజు నాడు వేసుకొని చూశాను. ఫర్లేదు, మరీ ఈస్ట్ మన్ కలర్ సినిమా హీరో డ్రెస్ లాగా లేదు గానీ, ఒక రాజకీయపార్టీ తీర్ధం పుచ్చుకున్నాననిపించేలా ఉంది. ఆ రోజే తనతో చెప్పేశాను “ ఆఫీసుకు మాత్రం వేసుకెళ్ళను గాక వేసుకెళ్ళను” అని. ఈ రోజు నన్ను తెలివిగా కార్నర్ చేసింది. అయిష్టంగానే వేసుకొని ఆఫీసుకు వెళ్ళాను. బాస్ ని కదా, న...