MMTS కధలు: ముక్కలైన ముచ్చట
“ ఏంటీ! ఈ షర్ట్ వేసుకొని ఆఫీసుకు వెళ్ళమంటావా” నా భార్య బయట పెట్టి ఉంచిన చొక్కా చూసి “అరుపు” అనిపించేంత గొంతుతో అడిగాను.
“దానికేమైంది? కొత్తదైతేనూ పైగా” అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చింది వంట గది లోనుండి.
“అది ఆఫీసుకు మాత్రం వేసుకెళ్ళనని ముందే చెప్పానుగా!” వేరే చొక్కా కోసం వెతుకుతూ అన్నాను.
“ ఇంతలో మీకేమయి పోదుగానీ ఇవాల్టికి వేసు కెళ్ళండి. కొన్ని ఉతకడానికి ఉన్నయ్ , కొన్ని ఇస్త్రీకి ఉన్నయ్ “ ఒక అధికారి లాగా చెప్పేసి వెళ్ళి పోయింది.
ఆ చొక్కాని రెండు నెలల క్రిందట నా పుట్టిన రోజుకు తనే స్వయంగా వెళ్ళి ఒక మాల్ లో కొనుక్కొచ్చింది. లినెన్ టెక్స్ఛర్ లో మంచి బ్రాండెడ్ కంపెనీది. అంతా బాగనే ఉంది, రంగే - ఎర్రటి ఎరుపు. నాకు నప్పదు అని నా అభిప్రాయం. పుట్టిన రోజు నాడు వేసుకొని చూశాను. ఫర్లేదు, మరీ ఈస్ట్ మన్ కలర్ సినిమా హీరో డ్రెస్ లాగా లేదు గానీ, ఒక రాజకీయపార్టీ తీర్ధం పుచ్చుకున్నాననిపించేలా ఉంది. ఆ రోజే తనతో చెప్పేశాను “ ఆఫీసుకు మాత్రం వేసుకెళ్ళను గాక వేసుకెళ్ళను” అని.
ఈ రోజు నన్ను తెలివిగా కార్నర్ చేసింది.
అయిష్టంగానే వేసుకొని ఆఫీసుకు వెళ్ళాను. బాస్ ని కదా, నా ముందు ఎటువంటి వ్యాఖ్యానాలు లేవు. మా అటెండర్ మాత్రం “షర్ట్ మంచిగుంది సారూ” అన్నాడు.
ఆఫీసు అయ్యాక బయటకి వస్తున్నప్పుడు నా డెప్యూటీ “ M & S brand కదా! ఇంకో రంగు లో లేదు, మొన్న నేను కూడా చూశాను” అన్నాడు.
అంటే ఈ రంగు అని కొనలేదన్నట్టుగా చెప్పకనే చెప్పాడు. “నిన్నెవడడిగాడయ్యా?” అందామని పించింది. ఓ మొహమాటపు నవ్వు వేసి బయటికొచ్చి ఆటో మాట్లాడుకొని సికింద్రాబాద్ స్టేషన్ కొచ్చాను.
“లింగంపల్లి వెళ్ళవలసిన MMTS మరి కొద్ది నిముషాలలో పదవ నెంబరు ప్లాట్ ఫారం పైకి వచ్చును” అనౌన్సుమెంట్ వినిపించింది తెలుగులో. వేరే భాషల్లో చెబుతున్నవి తలకెక్కడం లేదు.
“పదిలో ఇచ్చాడా” అనుకుంటూ గబగబా నడుచుకుంటూ వెళ్ళి పదో నంబరు ప్లాట్ ఫాం చేరుకున్నాను.
ప్లాట్ ఫాం మీద వడివడిగా నడుస్తుంటే ఎవరో పిలిచినట్లన్పించి ప్రక్కకి చూశాను. జలజ మేడం, మా అమ్మాయి వాళ్ళ క్లాస్ టీచర్ , చుట్టూ సామానుతో మధ్యలో ఫౌంటేన్ లో మెర్ మెయిడ్ లాగ నిల్చొని ఉంది. మొన్నీమధ్య దాకా మా అపార్ట్ మెంట్స్ లోనే ఉండి, లింగంపల్లిలో ఇల్లు కట్టుకొని అక్కడకి మారారు.
“బాగున్నారాండీ” నవ్వుతూ పలకరించింది.
“ఆ.. మీరేంటీ, ఇక్కడ, ఇంత సామానుతో ఒక్కళ్ళు” పలకరిస్తూ దగ్గర కెళ్ళాను.
“ఒక్కర్తిని కాదు. అక్కడ కాఫీ స్టాల్ దగ్గర కాఫీ తాగుతున్నారే, ఆమె మా పెద్దమ్మ. ఆమే, నేనూ కలిసి వైజాగ్ నుండి వచ్చాం. ఆమెని ఇక్కడ డాక్టర్ కి చూపించడానికి తీసుకొస్తున్నాను” చెప్పింది.
మళ్ళీ ఆమే “మీరు ఆఫీసు నుంచా?” అంది.
“అవును. MMTS పట్టుకుందామని వస్తున్నాను. మీరు? ఎలా వెళ్తున్నారు?” .
“మేమూ దానికే. కాకపోతే ఈ లగేజితో ఆ పెద్దామెతో ఎక్కగలనా అన్పిస్తోంది” కొంచెం నిస్సహాయత గోచరించే గళం.
“అమ్మ జలజా జీ! ఎంత తెలివిగా నన్ను పలకరించారు, ఆపై ఇరికించారూ!” అనుకున్నాను.
“ఫర్లేదండీ, నేనెక్కిస్తాను లేండీ. లేడీస్ కంపార్ట్ మెంటు ఉంటుంది. దాన్లో కొంచెం రష్ తక్కువుంటుంది. రండి బండి వచ్చేస్తోంది” అంటూ రెండు చేతులతో రెండు బ్యాగ్స్ తీసుకున్నాను.
కాఫీ తాగి వస్తున్న వాళ్ళ పెద్దమ్మతో “నువ్వు ఇక్కడే సామాను దగ్గర నిలబడి ఉండు ఆమ్మా. నేను ఇవి అక్కడ పెట్టి మళ్ళీ వస్తాను” అంటూ నన్ను అనుసరించింది.
ఆడవాళ్లు తమంతట తాముగా పిలిచి మాట్లాడిస్తే ఇంత మతలబు ఉంటుందా! - నా ఆలోచనలు.
పాపం లే! ఎవరూ తెలిసిన వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నడు తెలిసిన వాళ్ళు కన్పిస్తే సహాయపడతారని ఆశించండంలో కుట్ర ఏముంటుందిలే - నా అంతరాత్మ ఆకాశవాణి పాత్రలో ఘోష!
లేడీస్ బోగీలో సామాను ఉంచాను. వెనకాలే జలజ గారు సామానుతో బోగీలో ఎక్కి నేను తెచ్చిన బ్యాగ్స్ కూడా దగ్గరకు లాక్కుంటోంది.
కిటికీ ప్రక్కనే ఉన్న ఖాళీ సీటు చూపించి “ మీరు ఇక్కడ కూర్చోండి. మళ్ళీ సీటుండదు. నేను మీ పెద్దమ్మ గారినీ మిగిలిన లగేజీ తెస్తా” అంటూ వాళ్ళ పెద్దమ్మ దగ్గరకొచ్చి మిగిలిన బ్యాగ్స్ తీసుకొని ఆమెని నా కూడా రమ్మన్నాను.
ఎంట్రన్స్ దగ్గరే జలజ గారు, నా చేతిలో సామాను అందుకొని థేంక్స్ చెప్పారు. నేను నవ్వి, బయల్దేరి నా బోగీ కోసం వెళ్ళ బోతుంటే వాళ్ళ పెద్దమ్మ అన్నది “ ఓ పది రూపాయలు ఎక్కువే ఇవ్వవే జలజా”.
“ఎవంటున్నావు? ఎవరికివ్వమంటున్నావు?” జలజ భయపడుతూ అడిగింది.
“అతనికే! కూలీకి”
నా బోగీ వైపు నడూస్తూన్న నాకు వాళ్ళ పెద్దమ్మ మాటలు విపించినయ్ . నేను తిరిగి వాళ్ళ వైపు చూడలేదు - నాకు వినపడక పోయి ఉండచ్చు అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ జలజ గారికి ఇచ్చాను.
పెద్దమ్మ గారి మాటలు నన్ను బాధించలేదు, నేరం ఆమెది కాదు - నా చొక్కా రంగుది!
___________
ఇంట్లోకి అడుగు పెడ్తూనే “ ఒక చాయ్ అల్లం వేసి” అంటూ హోటల్ సర్వర్ లా అరిచి ఆర్డర్ ఇచ్చాను.
ఫ్రెష్ అయి లుంగీ కట్టుకొని వచ్చి సోఫాలో కూర్చున్నానో లేదో చాయ్ తెచ్చి చెతిలో పెట్టి, ప్రక్కనే కూర్చుంది సతీమణి.
చాయ్ సిప్ చేస్తూ తన వంక చూసాను, తను తదేకంగా షర్ట్ వంకే చూస్తోంది. స్టేషన్ లో జరిగిందేదీ తనకి చెప్పాలనుకోలేదు.
“ ఈ షర్ట్ వేసుకొని ఇంక ఆఫీసుకు వెళ్ళద్దండీ…. కాదు..కాదు… రైల్వే స్టేషన్ కే వెళ్ళద్దండీ “ అంటున్నప్పుడు, ఓ విచ్చీ విచ్చని నవ్వూ, కంటి పాప మీద తడి దాచుకో లేక పోయింది.
అంటే జలజ గారు జరిగిందంతా చెప్పేసిందన్నమాట.
“జలజ గారు చాలా బాధ పడ్డారు. మీతో మాట్లాడాలంటే భయమేస్తోందట”
“ రేపు వచ్చే ఆదివారం మనమే వాళ్ళింటి కెళ్దాం, మళ్ళీ అదే షర్ట్ వేసుకుని, అంతేకాదు కూలీ వాడికి ఇంత అందమైన పెళ్ళామా అని కూడా వాళ్ళ పెద్దమ్మ ఆశ్చర్య పోవాలి” అని నేను అనడంతో జనియించిన గర్వం తన మనసు లోని బాధని ఆవిరి చేసేసింది.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
( రా. శా. )

Comments
Post a Comment