ఋణాను బంధరూపేనా….. ప్రహ్లాద్ తన వయసు ఇరవైల్లో ఉన్నప్పడే అరుదైన అవకాశం రావడంతో అమెరికా వెళ్ళిపోయాడు. గత నలభై ఏళ్ళుగా అక్కడ పేరూ, డబ్బూ బాగా సంపాదించాడు. పిల్లలు కూడా అక్కడే స్థిరపడ్డారు. ఒకానొక శుభముహూర్తాన కలిగిన ఆలోచనతో మాతృభూమి ఋణం తీర్చుకోవాలని తనూ భార్యా తిరిగి వచ్చశారు సొంత ఊరు విశాఖపట్నానికి. రాగానే తన చిన్ననాటి స్నేహితుడు మురళి గురించి వాకబు చేసాడు. అతని అడ్రసు సంపాదించి వెళ్ళాడు అతను ఉండే చోటుకి. అది ఒక వృద్ధాశ్రమం. ప్రహ్లాద్ ని చూసి మురళి బావురుమన్నాడు. మాటల్లో మురళి భార్య మూడేళ్ళ క్రితం చనిపోయినట్లు, కొడుక్కి ఏ ఉద్యోగం రాకపోతూంటే తను అనారోగ్యం కారణం చూపించి కొడుక్కి తన ఉద్యోగం ఇప్పించుకున్నట్టు, తనని చూసుకోడం కొడుకూ కోడలికి అదనపు బాధ్యత అవడంతో దాన్నుంచి బయటపడడానికి స్వచ్ఛందంగా వృద్ధాశ్రమం తలుపులు తట్టినట్టు తెలిసింది ప్రహ్లాద్ కి. చాలాసేపు అక్కడే అతనితో గడిపి తిరిగి తన ఇంటికి బయల్దేరాడు ప్రహ్లాద్ . ****** ఇంటి కొచ్చాక భార్యతో తన చిన్ననాటి రోజులు పంచుకున్నాడు ప్రహ్లాద్ . నేనూ మురళీ ఒకే స్కూలూ, తర్వాత ఒకే కాలేజీ లో చదువుకున్నాం. మురళి చదువుల...