Skip to main content

Posts

Showing posts from December, 2017

MMTS కధలు: పెర్ ఫార్మెన్స్ అప్రైజల్

MMTS కధలు: పెర్ ఫార్మెన్స్ అప్రైజల్ నేను చందానగర్ లో ఎక్కిన MMTS బండి వచ్చి హఫీజ్ పేట్ స్టేషన్ లో ఆగింది. బిలబిల మంటూ జనం లోపలికి ఎక్కడానికి తొందర పడుతున్నారు. ఎంట్రన్స్ దగ్గరే నిలబడి ఉన్న స్టూడెంట్స్ ప్రక్కకి జరిగి దోవ ఇస్తున్నారు తప్ప అక్కడి నుంచి లోపలికి రావడం లేదు. ఎక్కేవాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వయసులో ఉన్నవాళ్ళు గబగబ ఎక్కేసి సీట్లు ఆక్రమించుకుంటున్నారు. కిటికీ ప్రక్కనే కూర్చున్న నా దృష్టి, బండి గబగబ ఎక్కడానికి వస్తున్న ఒక పెద్దాయన మీద నిలిచింది. రెండు చేతుల్లోనూ రెండు సంచులు ఉన్నాయి. వెనకాలే ఒక నడి వయస్కురాలు సూట్ కేసు లాగుతూ వస్తూ, “ ముందు మీరెక్కండి మామయ్యా. నేనిది లోపలకి ఎక్కిస్తాను” అంటోంది. బండి నిముషం కూడా ఆగదు, ఎక్కగలడా! అనుకుంటున్నాను. వడివడిగా నడుచుకుంటూ వచ్చి ఆయన ఎక్కాడు. వెనకాలే ఆమె పరుగున వచ్చి కదలడం మొదలైన బండిలోకి ఎక్కించి “ జాగ్రత్తగా దిగండి మామయ్యగారూ. చాలాసేపు ఆగుతుంది స్టేషన్ లో. అవసరమైతే కూలీ పెట్టుకోండి తొందర పడకండి దిగేటప్పుడు” కదులుతున్న బండి తోనే నడుస్తూ చెప్పింది. పెద్దాయనికి ఎంత వినపడిందో నాకు అర్దంకాలేదు. ఆయన్ని చూస్తుంటే “బండి ఎక్కగలనా?” అన్న టె...

MMTS:పుణ్యానికి పోతే......

MMTS కధలు : పుణ్యానికి పోతే …. చందానగర్ స్టేషన్ దగ్గర బండి పార్క్ చేసి టిక్కెట్ తీసుకోడానికి కౌంటర్ దగ్గరకొచ్చాను. చాంతాడంత క్యూ కనిపించింది. ఇంకో అయిదు నిముషాల్లో ట్రైయిన్ వస్తుంది, ఈ రద్దీలో టికెట్ దొరుకుతుందా అనుకుంటూ వెళ్ళి లైన్ లో నిలబడ్డాను. అసహనం నాలోకి ఎప్పుడు ప్రవేశించిందో కానీ, వళ్ళంతా పాకేసింది. నా కాళ్ళు స్థిరంగా నిలవడం లేదు, చేతులు పాంట్ జేబులోకి వెళ్తున్నాయ్ , బయటికి వస్తున్నాయ్ . కళ్ళు పదే పదే వాచీని చూస్తూ, నా ముందు నిలబడి ఉన్న వాళ్ళని లెక్క పెడుతున్నాయ్ . ఇంకా రెండు  నిముషాలే ఉంది, నాకు ముందేమో ఎనిమిది మంది దాకా ఉన్నారు. కాలి మునివ్రేళ్ళ మీద నిలబడి మా లైన్ లో టిక్కెట్ ఇచ్చే వ్యక్తిని చూసాను, నిన్నో మొన్నో కంప్యూటర్ లో టిక్కెట్ ఇవ్వడం నేర్చుకున్నట్లు ఉన్నాడు. అతనిలో ఏమాత్రం తొందర కనపడటంలేదు టిక్కెట్ ఇవ్వడానికి. ప్రక్కనే ఉన్న లైన్ కొంచెం వేగంగా కదులుతోంది, కారణం అక్కడ టిక్కెట్ ఇచ్చే అమ్మాయి వ్రేళ్ళూ, కళ్ళూ చకచకా కదులు తున్నాయి. అందులోకి వెళ్ళి నిలబడి ఉంటే బాగుండేది అన్పించింది. ఇంతలో “ నేనొస్తున్నానహో” అన్నట్టు దూరంగా నేనెక్క వలసిన MMTS కూత వినిపించింది. కౌం...