MMTS కధలు : పుణ్యానికి పోతే ….
చందానగర్ స్టేషన్ దగ్గర బండి పార్క్ చేసి టిక్కెట్ తీసుకోడానికి కౌంటర్ దగ్గరకొచ్చాను. చాంతాడంత క్యూ కనిపించింది. ఇంకో అయిదు నిముషాల్లో ట్రైయిన్ వస్తుంది, ఈ రద్దీలో టికెట్ దొరుకుతుందా అనుకుంటూ వెళ్ళి లైన్ లో నిలబడ్డాను.
అసహనం నాలోకి ఎప్పుడు ప్రవేశించిందో కానీ, వళ్ళంతా పాకేసింది. నా కాళ్ళు స్థిరంగా నిలవడం లేదు, చేతులు పాంట్ జేబులోకి వెళ్తున్నాయ్ , బయటికి వస్తున్నాయ్ .
కళ్ళు పదే పదే వాచీని చూస్తూ, నా ముందు నిలబడి ఉన్న వాళ్ళని లెక్క పెడుతున్నాయ్ .
ఇంకా రెండు నిముషాలే ఉంది, నాకు ముందేమో ఎనిమిది మంది దాకా ఉన్నారు. కాలి మునివ్రేళ్ళ మీద నిలబడి మా లైన్ లో టిక్కెట్ ఇచ్చే వ్యక్తిని చూసాను, నిన్నో మొన్నో కంప్యూటర్ లో టిక్కెట్ ఇవ్వడం నేర్చుకున్నట్లు ఉన్నాడు. అతనిలో ఏమాత్రం తొందర కనపడటంలేదు టిక్కెట్ ఇవ్వడానికి. ప్రక్కనే ఉన్న లైన్ కొంచెం వేగంగా కదులుతోంది, కారణం అక్కడ టిక్కెట్ ఇచ్చే అమ్మాయి వ్రేళ్ళూ, కళ్ళూ చకచకా కదులు తున్నాయి. అందులోకి వెళ్ళి నిలబడి ఉంటే బాగుండేది అన్పించింది.
ఇంతలో “ నేనొస్తున్నానహో” అన్నట్టు దూరంగా నేనెక్క వలసిన MMTS కూత వినిపించింది. కౌంటర్ దగ్గర కెళ్ళి “కొంచెం తొందరగా ఇవ్వండి, బండి వచ్చేస్తోంది” అని అరిచి వచ్చి మళ్ళీ వరుస లో నిలబడ్డాను. జేబులో చేయి పెట్టి డబ్బులు తీసి సిద్ధంగా ఉంచుకున్నాను.
ఇంతలో ఒక పది - పన్నెండు సంవత్సరాల కుర్రాడు నా దగ్గరకొచ్చి, అడిగాడు “ మీరెక్కడికి వెళ్ళాలి అంకుల్ ?”.
“లకడీ కా పూల్ “ చెప్పాను.
“నా దగ్గర నాంపల్లి వెళ్ళే టిక్కెట్ ఉంది. వేరే పని వచ్చి నేను వెళ్ళడం లేదు. మీకు కావాలా?” అని అడిగాడు.
లకడీ కా పూల్ , నాంపల్లి కంటే ముందు స్టేషనే కనక నష్టంలేదు. పైగా ట్రైన్ వచ్చేస్తోంది. నా కోసమే వచ్చినట్టున్నాడు అనుకుంటూ, టిక్కెట్ డబ్బులు వాడి చేతిలో పెట్టి టికెట్ తీసుకొని చూశాను. చందానగర్ - హైదరాబాదు అని వ్రాసి ఉంది. ఇంకేం చూడకుండా టికెట్ జేబులో పెట్టుకొని ప్లాట్ ఫారం మీదికి పరిగెత్తాను. అప్పటికే MMTS వచ్చి ఆగింది.
కొంచెం రద్దీ తక్కువగా ఉన్న బోగీ చూసుకొని ఎక్కి, మనసులోనే ఆ కుర్రాడికి థ్యాంక్స్ చెప్పు కున్నాను, ఆఫీసుకు ఆలస్యంగా వెళ్ళడం తప్పినందుకు. వెతుకుతూనే మూల మీద ఖాళీ సీటు దొరకడంతో “అమ్మయ్య… అన్నీ మంచి శకునములే” అనుకుంటూ వెళ్ళి కూర్చోని ఊపిరి పీల్చుకున్నాను.
పై నుండి టికెట్ తనిఖీ చేసుకుంటూ TC వస్తోంది. నా ముందు వరుసలో ఒక పెద్దామె దగ్గర తనిఖీ చేస్తుంటే ఎదో ఇబ్బంది వచ్చింది లా ఉంది “ ఫైన్ కట్టండి” అంటోంది TC. ఇంకొంచెం ఆలకించి విన్నాను వాళ్ళ సంభాషణ.
“ఇది నిన్నటి టికెట్ . ఈ రోజుది కాదు. మీరు ఫైన్ కట్టాల్సిందే”
“నేను ఇందాకనే కొన్నాను. నిన్నటిది ఎలా అవుతుంది?”
“కావాలంటే మీరే చూడండి దీని మీద తేదీ నిన్నటిది ఉంది. ఎక్కడ బయట ఎవరి దగ్గరైనా కొన్నారా?” అడిగింది TC.
నా గుండె గుభేలు మంది.
“అవును. ఒక ఆమె దగ్గర కొన్నాను. ఆమెకి వేరే ఏదో పని పడి వెళ్ళాలనుకున్నది మానుకుందట. పాపం లే అని ఆమె దగ్గర తీసుకొన్నాను. మోసం చేసినట్టుంది. దొంగ మొహం ది…..” చెప్తోంది ఆమె.
నా వెన్ను లో చలి, చేతుల్లో చెమట మొదలైంది.
భయం భయం గా టిక్కెట్ చేతి లోకి తీసుకొని చూసాను.
నా టిక్కెట్ కూడా అదే బాపతు!
నిన్నటి ది, ఈ రోజుది కాదు.
నేనూ మోసపోయాను. నా తెలివిని నేనే తిట్టుకున్నాను.
కానీ ఇప్పుడు సమస్య అదికాదు….. ఫైన్ కట్టాల్సి వస్తోంది.
“నా దగ్గర పైసల్లేవు” చెబుతోంది పెద్దామె.
“వచ్చి స్టేషన్ లో కూర్చో… పైసలు అవే వస్తాయ్ “ TC అంటోంది.
నా పరిస్థితి నాకు ఒక ముత్తైదువ, ఒక దొంగ సామెతలు గుర్తు తెస్తోంది.
ఇంతలో ట్రైన్ ప్రక్క స్టేషనుకు వచ్చి ఆగింది.
TC ఆమెని దిగమంటోంది. ఆమె దిగనంటోంది.
బ్రతుకు జీవుడా అనుకుంటూ నేను దిగేశాను.
“నన్ను పట్టుకోలేదు. నేను ఫైన్ కట్టక్కర్లేదు. నేనేం కావాలని చేయలేదు. పైగా మోసపోయాను” నాకు నేను వెతుక్కున్న సమాధానం.
స్టేషన్ వదిలి వెళ్ళి నన్ను దాటుకుంటూ పోతున్న MMTS కూత నాకు “ బ్రతికి పోయావ్ ర రే య్ ..” అన్నట్టు వినిపించింది.
****************
( రా. శా. )

Comments
Post a Comment