Skip to main content

Posts

Showing posts from July, 2021

సీ గానపెసూనాంబ - ఓ దక్షిణ

  నేను ముళ్ళపూడి వెంకట రమణ గారి అభిమానిని. ఎంత అభిమానినో చాలా, బాగా, గొప్ప అని విశేషణలు చేర్చలేనంత. అభిమానం అనుభవించడంలోనే తెలుస్తుంది మనమెంత అభిమానో.  చదువుకునే రోజుల్లో వారి రచనలు చదివి వాటిల్లోని కొన్ని పదాలను పదేపదే వల్లించుకుంటూ ఉండేవాళ్ళం. విజయా వారి సినిమాల తర్వాత ప్రజల చేత విశేషంగా సంభాషణలను వల్లె వేయించిన సినిమా ముత్యాలముగ్గు. ఆ ఘనతంతా ముళ్ళపూడి గారికే. ఇప్పటికీ ఆ తరం వాళ్ళ నాలుక చివర్న అవి ఉన్నాయి. ఇహ బుడుగు విషయానికొస్తే అదో సంచలనం. పుస్తకాన్నెక్కిన ముళ్ళపూడి బాల్యం. అమూల్యం. ఆయన ఇరవై ఏళ్ళ వయసప్పుడే బురుగుని కన్నాడు. ఆ బుడుగుకు దృశ్యరూపం ఇచ్చింది బాపూ. అల్లరికో తెలివితేటలకో మాటకారితనానికో ఓ బ్రాండు అంబాసిడర్ . ప్రతి తల్లిదండ్రీ వాళ్ళ అబ్బాయిని బుడుగుగా చెప్పుకోడం ఒక క్రెడిబిలిటీ, అసలు వాళ్ళ పిల్లడిలో అంత విషయం ఉన్నా లేకున్నా. ముళ్ళపూడి వారి "బుడుగు" సీరియల్ గానూ, పుస్తకంగానూ ఎన్నో ఇళ్ళు చుట్టేశాడు. కొన్నిళ్ళు మళ్ళీ మళ్ళీ నూ. అట్లాంటి బుడుగు నన్నూ బాగా ఆకర్షించాడు. అదే కాదు కొన్ని సందర్భాల్లో బుడుగు భాషే మాట్లాడించాడు. దాని వల్ల నాకేదో ఐక్యూ బాగావుంది అనుకునే అపార్ధ...