“కొంచెం అర్జెంటుగా పోలీసు స్టేషనుకెళ్ళాలి, దారి చెబుతావా బాబూ” కొత్తగా హైదరాబాదు వచ్చిన వ్యక్తి అడిగాడు రోడ్డు మీద కన పడిన ఓ స్టూడెంట్ ని. “స్ట్రెయిగా ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళి, కుడివైపు తిరిగి ఓ ఫర్లాంగు వెళ్ళాక ఎడమవైపు రెండో సందులో ఉంది..” చెప్పాడా స్టూడెంటు కుర్రాడు. “ఎంతసేపు పట్టచ్చు?” అడిగాడా హైదరాబాదుకి కొత్త మనిషి. “ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో ఒక అరగంట పట్టచ్చు” “దగ్గర దారి ఇంకేది లేదా” “ ఉంది…. ఆ ఎదురుగా వస్తున్న ఆంటీ మెడలో ఉన్న బంగారం గొలుసు గట్టిగాపట్టి గుంజేయండి” చెబుతూ బస్సెక్కేసాడు స్టూడెంట్ కుర్రాడు. -------------------------------------------------------- ఎడిటర్ : ఏంటి మీరు మా పత్రికకి కార్టూన్లు పంపడం మానేసారు? కార్టూనిస్టు: కార్టూన్ క్రింద కార్టూనిస్టు పేరుతో పాటు ఇంటి అడ్రస్సు కూడా వేయడం మొదలు పెట్టారుగా మీరు! --------------------------------------------------------- "ఇదేనండీ... నిన్న చెప్పానే మావారు కొన్న ఇంత బారు కారు, చవకగా దొరికింది" ఇంటి ముందుంచిన కారును చూపిస్తూ చెప్పింది రమాప్రభ పక్కింటి గిరిజకి. కారు...