Skip to main content

బేబి టపాస్


“కొంచెం అర్జెంటుగా పోలీసు స్టేషనుకెళ్ళాలి, దారి చెబుతావా బాబూ” కొత్తగా హైదరాబాదు వచ్చిన వ్యక్తి అడిగాడు రోడ్డు మీద కన పడిన ఓ స్టూడెంట్ ని.


“స్ట్రెయిగా ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళి, కుడివైపు తిరిగి ఓ ఫర్లాంగు వెళ్ళాక ఎడమవైపు రెండో సందులో ఉంది..” చెప్పాడా స్టూడెంటు కుర్రాడు.


“ఎంతసేపు పట్టచ్చు?” అడిగాడా హైదరాబాదుకి కొత్త మనిషి.


“ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో ఒక అరగంట పట్టచ్చు”


“దగ్గర దారి ఇంకేది లేదా”


“ ఉంది…. ఆ ఎదురుగా వస్తున్న ఆంటీ మెడలో ఉన్న బంగారం గొలుసు గట్టిగాపట్టి గుంజేయండి” చెబుతూ బస్సెక్కేసాడు స్టూడెంట్ కుర్రాడు.
--------------------------------------------------------

ఎడిటర్ : ఏంటి మీరు మా పత్రికకి కార్టూన్లు పంపడం మానేసారు?

కార్టూనిస్టు: కార్టూన్ క్రింద కార్టూనిస్టు పేరుతో పాటు ఇంటి అడ్రస్సు కూడా వేయడం మొదలు పెట్టారుగా మీరు!
---------------------------------------------------------

"ఇదేనండీ... నిన్న చెప్పానే మావారు కొన్న ఇంత బారు కారు, చవకగా దొరికింది" ఇంటి ముందుంచిన కారును చూపిస్తూ చెప్పింది రమాప్రభ పక్కింటి గిరిజకి.

కారును తేరిపార చూసిన గిరిజ కామెంట్ "చవకబారు కారన్నమాట".
----------------------------------------------------------

అతి కష్టంమ్మీద తమ శరీరాల్ని కిక్కిరిసిన seven seater auto లోంచి బయట పడేయగలిగారు బ్రహ్మానందం, ఆలీ.

ఆలీ: బాబాయ్ ... గత జన్మలో ఏవై పుట్టుంటాడు ఈ ఆటో డ్రైవరు.

బ్ర: డౌటే లేదు... అగ్గి పెట్టెలో పట్టే ఆరు గజాల చీరెని నేసిన వాడై ఉంటాడు.
-----------------------------------------------------------

పెళ్ళి విందులో మగ పెళ్ళి వారి వైపు నుండి వచ్చిన ఇద్దరు స్తీృల మధ్య సంభాషణ --

"ఆడ పెళ్ళి వారు బాగా ఉన్న వారటగా!"

"అవును. ప్రొద్దున టిఫినులో టమోటా బాత్ , ఇప్పుడు భోజనాల్లోకి సలాడ్ లో టమోటా, టమోటా పప్పు, టమోటా పచ్చడి, మునగకాయ - టమోటా కూర, టమోటా రసం, ఇవన్నీ చూస్తుంటే తెలియట్లే?"

"బడాయి కాకపోతే ఇంతగా చూపించుకోవాలేంటీ?"

"అంతే కాదు రిటర్న్ గిఫ్టు కింద కవర్లలో రెండు టమోటాలు కూడా ఇస్తున్నారుట"

**********
నీతి:
టమోటా చెట్టు ఒకటి పెరట్లో ఉంటే చాలు - ఇంట్లో శమంతకమణి కూడా అక్కర్లేదు
🍅🍅💃🏽💃🏽🍅🍅
-----------------------------------------------------------------


ప్రమాదం లో కాలు పోగొట్టుకున్న అల్లుడిని చూడటానికి వచ్చాడు మామగారు.

పరామర్శ చేసి, జాగ్రత్తలు చెప్పి  తిరిగి వెళ్తూ ఇంటి బయటి దాకా వచ్చిన కూతురు తో అన్నాడు -- "జగర్తగా చూసుకోమ్మా... అసలే కోపిష్టి వాడన్నావ్ . ఇప్పుడెలా ఉంటున్నాడు?"

" ఇప్పుడు అయిందానికీ కాని దానికీ ఒంటి కాలు మీద లేస్తున్నారు నాన్నా" కూతురు సమాధానం.


-------------------------------------------------------------------

Comments

Popular posts from this blog

మృత్యువు కు చెక్

MMTS కధలు మృత్యువు కు చెక్ : చందానగర్ స్టేషన్ లో నేను ఎక్కాల్సిన MMTS బండి వచ్చి ఆగింది. టైమ్ చూసుకుంటూ బోగీ దగ్గరకి నడిచాను. బండి పావుగంట ఆలస్యం. ఇంకెక్కడా ఆలస్యం అవకుండా బండి నడిస్తే ఆఫీసుకు అయిదు నిముషాలు ముందు చేరుకుంటాను. లేదంటే బాసు పెట్టే నోటి వాతలకి సిద్దంగా ఉండాలి. అవును మరి, రచయిత జంధ్యాల గారికి కూడా తట్టని తిట్లు తిట్టగలడు మా బాసు. అంత కొత్తగా వేడిగా పడేవి మరి నోటి వాతలే కదా!  శరీరం మీది మామూలు వాతలైతే అంగీతోనో, పాంటు తోనో దాచుకోవచ్చు. కానీమా బాసు పెట్టే సెటైరిక్ శాడిస్టు నోటివాతలు, రెండు బదిలీల మీద రెండు ఆఫీసులు మారినా మర్చిపోలేం! బోగిలోకి ఎక్కి చక్రవర్తి కోసం చూసాను, ఎక్కడ ఉన్నాడా? అని. కన్పడలేదు. చక్రవర్తి MMTS బయల్దేరే స్టేషన్ లింగంపల్లిలో ఎక్కుతాడు. తనప్రక్క సీటు నా కోసం ఆపి ఉంచుతాడు. ఇద్దరం ఒకే ఆఫీసు అవడంతో మా MMTS పయనం రోజూ మూడు యధార్ధాలు, ఆరు పుకారుల కబుర్లతో నడిచి పోతోంది. ఎప్పుడైనా ఎవ్వరం సెలవు పెడుతున్నా రెండో వాళ్ళకి చెప్పుకుంటాం. “ ఈ రోజు ఏమైంది తనకి” అనుకుంటూ ఖాళీగా కనబడ్డ సీటులోకి శరీరాన్ని చేర్చాను. “మీ బెటర్ హాఫ్ ఏడి సర్ , కనబడ్డం లేదు?” -...

తన శాంతమె తనకు శిక్ష!

తన శాంతమె తనకు శిక్ష! పదేళ్ళ క్రితం: "ప్రభా, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సరిపడ డబ్బులున్నాయ్ ! మీ అమ్మగార్ని వచ్చి మనతో ఉండమనచ్చు కదా! అక్కడ ఒక్కరెందుకూ" భార్య యమున తన మనసులో మాట అన్నది భర్త ప్రభాకర్ తో. వెంటనే అమ్మకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకర్ . "మొన్ననే కదరా మీ పెళ్ళయింది. కొత్త కాపురంలో నేనెందుకురా పానకంలో పుడకలా" త్రోసి పుచ్చింది తల్లి. ****** తొమ్మిదేళ్ళ క్రితం: " ప్రభా, మనం ఈ బెడ్ రూమ్ మీ అమ్మ గారికే ఉంచుదాం. మిగిలిన దాన్లోనే మనం సర్దుకుందాం. అత్తయ్య గారికి చెప్పండి వచ్చేయమని మన దగ్గరకి" యమున తన ఆలోచన పంచుకుంది భర్తతో. " అదే చెప్పాను అమ్మతో. తొందరే ముందిరా? వస్తాన్లే అంటోంది" ప్రభాకర్ వివరణ భార్యకి. ****** ఎనిమిదేళ్ళ క్రితం: "ప్రభా మన చంటి దానికి సంబంధించిన వన్నీ మీ అమ్మగారి కోసం ఉంచిన గదిలో పెడుతున్నాను. ఆమె వచ్చినప్పుడు ఖాళీ చెస్తాను. మళ్ళీ అడగ రాదూ వస్తారేమో!" యమున. " అడిగాను. మొన్ననే పాప పుట్టింది కదరా, ఖర్చులు పెరుగుతుంటయ్ మీకు. మళ్ళీ ఆలోచిద్దాంలే అక్కడకి రావడం గురించి అంది అమ్మ" ప్రభాకర్ తెలిపాడు. ****** ఏడేళ్...
కిర్  కిర్   తలపులు నియమం: వ్రతాలు, రోజాలు, సువార్త కూటములు - ఆన్నింటిలో వ్యాపకం ఒకటే భజించడం .... దాగిఉందొక మూల వ్యాపకం తదుపరి భుజించడం