Skip to main content

తన శాంతమె తనకు శిక్ష!

తన శాంతమె తనకు శిక్ష!


పదేళ్ళ క్రితం:

"ప్రభా, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సరిపడ డబ్బులున్నాయ్ ! మీ అమ్మగార్ని వచ్చి మనతో ఉండమనచ్చు కదా! అక్కడ ఒక్కరెందుకూ" భార్య యమున తన మనసులో మాట అన్నది భర్త ప్రభాకర్ తో.

వెంటనే అమ్మకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకర్ .

"మొన్ననే కదరా మీ పెళ్ళయింది. కొత్త కాపురంలో నేనెందుకురా పానకంలో పుడకలా" త్రోసి పుచ్చింది తల్లి.

******

తొమ్మిదేళ్ళ క్రితం:

" ప్రభా, మనం ఈ బెడ్ రూమ్ మీ అమ్మ గారికే ఉంచుదాం. మిగిలిన దాన్లోనే మనం సర్దుకుందాం. అత్తయ్య గారికి చెప్పండి వచ్చేయమని మన దగ్గరకి" యమున తన ఆలోచన పంచుకుంది భర్తతో.

" అదే చెప్పాను అమ్మతో. తొందరే ముందిరా? వస్తాన్లే అంటోంది" ప్రభాకర్ వివరణ భార్యకి.

******

ఎనిమిదేళ్ళ క్రితం:

"ప్రభా మన చంటి దానికి సంబంధించిన వన్నీ మీ అమ్మగారి కోసం ఉంచిన గదిలో పెడుతున్నాను. ఆమె వచ్చినప్పుడు ఖాళీ చెస్తాను. మళ్ళీ అడగ రాదూ వస్తారేమో!" యమున.

" అడిగాను. మొన్ననే పాప పుట్టింది కదరా, ఖర్చులు పెరుగుతుంటయ్ మీకు. మళ్ళీ ఆలోచిద్దాంలే అక్కడకి రావడం గురించి అంది అమ్మ" ప్రభాకర్ తెలిపాడు.

******

ఏడేళ్ళ క్రితం:

"పాపకి పెద్ద తోడు ఉంటుంది, వాళ్ళిద్దరూ ఒక మంచం మీద పడుకుంటారు. అత్తయ్యగారు వచ్చేసే విషయం ఏమనుకుంటున్నారో, తెల్సుకో కూడదూ…" అనాలి కనుక అన్నట్లు ఉంది యమున గొంతు.

" పొద్దున అమ్మని అడిగా, రానని అన్లేదు కానీ ఎప్పుడొచ్చేది చెప్పలేదు" ప్రభాకర్ నిర్లిప్తంగా!

******

ఆరేళ్ళ క్రితం:

"ప్రభా మన సంసారం పెరుగుతోంది. ఇప్పుడు మీ అమ్మ గారు మనతో ఉండాలంటే మూడో బెడ్రూమ్ కావాల్సి ఉంటుంది" నెలలు నిండిన యమున తన రెండో సంతానం గురించి ఆలోచిస్తూ ప్రభాకర్ తో అంది.

" అక్కడ అమ్మకొచ్చిన కష్టం ఏమీ లేదుగా! ఆలోచిద్దాం" ప్రక్కకి తిరిగి పడుకుంటూ ప్రభాకర్ .

అక్కడ ప్రభాకర్ తల్లి కొడుకు నుండి ఇంకా రమ్మని పిలుపు రానందుకు విచారిస్తోంది.

******

అయిదేళ్ళ క్రితం:

" ప్రభాకర్ ! నాకు ఇదివరకటి ఓపిక ఉండట్లేదురా. ఇంక ఒక్కదాన్నీ ఉండ లేనన్పిస్తోందిరా" అమ్మ ఫోను ప్రభాకర్ కు.

" అమ్మా మూడు బెడ్రూములు ఉండే ఇల్లు వెతుకుతాను. కుదరగానే చెబుతాను" ప్రభాకర్ అమ్మతో.

******

నాలుగేళ్ళ క్రితం:

"యమునా, అమ్మ ఫోన్ చేసి అడిగింది - త్రీ బెడ్ రూమ్ ఇంకా దొరక లేదా - అని"

"పెరిగిన సంసారం, ఖర్చులతో అది కుదిరే పనిలా ఎక్కడుంది. ఉన్నదేమో ఇరుకైపోయింది సామాన్లు పెరిగి" యమున వ్యాఖ్యానం.

******

మూడేళ్ళ క్రితం:

"అమ్మ తన పెన్షన్ ఆఫర్ చేస్తోంది త్రీ బెడ్ రూమ్ ఇంటికి మారడానికి" ప్రభాకర్ .

" ఎంత సిగ్గుచేటు అలా తీసుకోడం మనకి! ఈ సంవత్సరమే పెద్దదాన్ని మంచి స్కూల్లో చేర్చాల్సి కూడా ఉంది. ఆ ఖర్చు లేక పోయినా బావుండేది" పరోక్షంగా అసమ్మతి రాగం యమున గళంలో.

******

రెండేళ్ళ క్రితం:

" అమ్మ తన మోకాలు ఆపరేషన్ ఇక్కడే చేయించు కుంటుందట. తగ్గాక మళ్ళీ వెళ్ళి పోతుందట" అమ్మ మాటని భార్యకి చెప్పాడు.

" అంటే ఒక అయిదారు నెలలు ఉన్నదాన్లోనే సర్దుకోవాలి అందరం" భవిష్యత్తు ముందుంచింది యమున.

******

ఏడాది క్రితం: 

" అమ్మ చేసుకోలేక పోతోందిట" ప్రభాకర్ .

" ఎవరైనా అటెండెంట్ ని పెట్టిద్దాం. మూడు బెడ్ రూమ్ ల ఇంటికి పెరిగే అద్దె ఖర్చు అటు పంపిద్దాం" సలహాగా అన్నది యమున.

******

ఆఫీసుకు వెళ్ళబోతూ...

"యమునా …. అమ్మ ఫోను చేసింది. మనం ఒకసారి వస్తే తన దగ్గర ఉన్న సామాన్లలో మనకి కావల్సినవి మనకి ఇచ్చి మిగిలినవి ఏ అనాధ ఆశ్రమానికో ఇచ్చేస్తుందట" ప్రభాకర్ భార్యతో అన్నాడు.

" మనతో ఒక్కమాట కూడా అనకుండా అలా వచ్చేద్దామని నిర్ణయించుకుంటే ఎలా" నిశ్చేష్టురాలై యమున.

"అమ్మ రావడం లేదు. స్వఛ్చందంగా వృధ్దాశ్రమంలో చేరిందట అక్కడే" 


Comments

Popular posts from this blog

మృత్యువు కు చెక్

MMTS కధలు మృత్యువు కు చెక్ : చందానగర్ స్టేషన్ లో నేను ఎక్కాల్సిన MMTS బండి వచ్చి ఆగింది. టైమ్ చూసుకుంటూ బోగీ దగ్గరకి నడిచాను. బండి పావుగంట ఆలస్యం. ఇంకెక్కడా ఆలస్యం అవకుండా బండి నడిస్తే ఆఫీసుకు అయిదు నిముషాలు ముందు చేరుకుంటాను. లేదంటే బాసు పెట్టే నోటి వాతలకి సిద్దంగా ఉండాలి. అవును మరి, రచయిత జంధ్యాల గారికి కూడా తట్టని తిట్లు తిట్టగలడు మా బాసు. అంత కొత్తగా వేడిగా పడేవి మరి నోటి వాతలే కదా!  శరీరం మీది మామూలు వాతలైతే అంగీతోనో, పాంటు తోనో దాచుకోవచ్చు. కానీమా బాసు పెట్టే సెటైరిక్ శాడిస్టు నోటివాతలు, రెండు బదిలీల మీద రెండు ఆఫీసులు మారినా మర్చిపోలేం! బోగిలోకి ఎక్కి చక్రవర్తి కోసం చూసాను, ఎక్కడ ఉన్నాడా? అని. కన్పడలేదు. చక్రవర్తి MMTS బయల్దేరే స్టేషన్ లింగంపల్లిలో ఎక్కుతాడు. తనప్రక్క సీటు నా కోసం ఆపి ఉంచుతాడు. ఇద్దరం ఒకే ఆఫీసు అవడంతో మా MMTS పయనం రోజూ మూడు యధార్ధాలు, ఆరు పుకారుల కబుర్లతో నడిచి పోతోంది. ఎప్పుడైనా ఎవ్వరం సెలవు పెడుతున్నా రెండో వాళ్ళకి చెప్పుకుంటాం. “ ఈ రోజు ఏమైంది తనకి” అనుకుంటూ ఖాళీగా కనబడ్డ సీటులోకి శరీరాన్ని చేర్చాను. “మీ బెటర్ హాఫ్ ఏడి సర్ , కనబడ్డం లేదు?” -...
కిర్  కిర్   తలపులు నియమం: వ్రతాలు, రోజాలు, సువార్త కూటములు - ఆన్నింటిలో వ్యాపకం ఒకటే భజించడం .... దాగిఉందొక మూల వ్యాపకం తదుపరి భుజించడం