Skip to main content

మేడ మీది అబ్బాయ్ - Cinema Review

మేడ మీది అబ్బాయ్ - Cinema Review
నిన్ననే release అయిన ఈ film చూడాలనిపించడానికి కారణం - ముఖ్యంగా cinema title. Title, ఓ తాసిల్దారుగారమ్మాయి , పక్కింటమ్మాయి , సీతారామయ్యగారి మనుమరాలు, లాగా సరళంగా family sentiment పండించేదిలా ఉండడంతో, అమ్మయ్య గుండెనొప్పొచ్చే సీన్లు, కలలో కూడా తరిమే fights, Sumoలు ఎగరడాలు, అరటిచెట్టు మొదలంటా నరికినట్టు నరుక్కోడాలు, హీరో ఎగిరి ఎగిరి తన్నడాలు ఉండవని చిన్న gamble చేసాను. ( హీరో చుట్టూ పొట్టి పొట్టి బట్టలేసుకున్న తెల్లజాతి స్త్రీలున్న poster కూడా కన్పడలేదులేండి )
నా gamble పని చేసింది - Director ఆ పేరు పెట్టడానికి కారణం తప్ప మిగిలినవన్నీ దొరికాయ్ .
Family cinema ఇష్టపడే వాళ్ళని theatre వరకు లాగడానికి మాత్రమే ఆ పేరు పెట్టి ఉంటే Director ఆ విషయంలో success అయినట్టే , పైగా హీరో అల్లరి నరేష్ .
సినిమా మొత్తంలో ఒకసారి మాత్రం నరేష్ చేత “మేడ మీది అబ్బాయ్ ని” అని చెప్పించి ఆ title సమర్ధించాననుకున్నాడు.
ఇతర తారాగణంలో హైపర్ ఆది, అవసరాల ముఖ్యులు. హీరో హీరోయిన్ల మధ్య  ఒక్క యుగళ గీతం కూడా అవసరం లేదు కాబట్టి అందాలు ఆరబోసే వాళ్ళని వద్దను కొని కొత్త అమ్మాయిని పరిచయం చేయడం మంచి ఆలోచన. మొదటి cinema అయినా పాత్రకు కావలిసిన నటన చూపించింది.
హైపర్ ఆది సరిపోవడానికి కారణం అతని పంచ్ డైలాగులు. పైగా heroకి ఉన్నంత length పాత్రని అతను carry చేయగలడనే నమ్మకం కూడా మంచి ఫలితాన్నిచ్చింది.
అల్లరి నరేష్ ఇట్లాంటి పాత్రలు కష్ట పడకుండా ( తన్నుకోడాలూ, డాన్సులు లేవుగా ) చేసేస్తాడు, చేసాడు కూడా.
హీరోలకి తక్కువ, సహాయ హీరోకి ఎక్కువ అయిన అవసరాల శ్రీనివాస్ కి మరో మంచి చిత్రం దొరికింది. అతన్ని select చేసుకోడంతోనే Director కి పాత్రల మీద ఉన్న అవగాహన  తెలుస్తోంది.
మిగిలిన artist లు, ముఖ్యంగా తులసి, అందరూ పాత్రోచితంగా రాణించారు.
కధలోకి వస్తే - ఏ మాత్రం చదువు మీద ఆశక్తి లేని ఓ కుర్ర గాంగ్ కి నాయకుడు అల్లరి నరేష్ . Engineering లో 24 subjects backlog తో ఇంటికొస్తాడు. అక్కడ ఇంకో equally తొట్టి స్నేహితుడు హైపర్ ఆది. చదువు రావట్లేదు కనక సినిమా Director అవ్వాలనుకుంటూ, ముందుగా ఓ short film తీసి youtube లో పెడితే తప్పకుండా మంచి  producer వెతుక్కుంటూ వస్తాడని ఆలోచన. Short Film కి హీరో, financer రెండూ ఆది నే. అవి కాక అమ్మ తులసి దాచుకున్న డబ్బులు కూడా పెట్టి తీసిన short film కాస్తా party చేసుకునేప్పుడు నీళ్ళల్లో పడి కొట్టుకు పోతుంది.
ఈ సమయంలోనే అదే ఊరికి హీరోయిన్ తండ్రి , Bank Manager ,  బదిలీ మీద రావడం నరేష్ ఇంటి ఎదురింట్లో దిగడం, ఆ దిగేటప్పుడు హీరోయిన్ని చూసి హీరో మనసు పారేసుకోడం జరిగి పోతాయి.
College results వచ్చే ముందు నరేష్ కి వాళ్ళనాన్న - నీకు చదువు రాదు గాని వచ్చి షాపు ( సొంతది కిరాణా దుకాణం ) లో  పొట్లాలు కట్టు. లేకపోతే నాలోని రౌడితనాన్ని చూస్తావ్ - అని వార్నింగ్ ఇస్తాడు.
పరీక్ష ఫలితాలు మామూలే - అన్నిట్లో తప్పడం తో నాన్న వార్నింగ్ గుర్తొచ్చి , హీరో ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ రైలెక్కేస్తాడు.
అదే బోగీలో హీరోయిన్ కూడా ఉంటుంది. మాటలు కలిపి Hyderabad లో ఉద్యోగం interview కోసం వెళ్తోందని తెలుసుకుంటాడు.
ఆ అమ్మాయికి తెలియకుండా , ఇద్దరూ పడేట్టుగా selfie తీసి, ఆదికి పంపిస్తాడు. రైలు హైదరాబాదు చేరాక లేచి చూస్తే హీరోయిన్ సీటు ఖాళీ -అప్పటికే దిగేసింది.
అక్కడ ఊర్లో హీరో  హీరోయిన్ ని లేవదీసుకు పోయాడని,  హీరోయిన్ వాళ్ళ నాన్న హీరో యింటి మీదికి రావడం మాట మాట పెరగడం, పెద్ద మనుష్యులు నరేష్ ని పిలిపించడం జరుగుతాయి.
హీరోయిన్ అసలు ఇంట్లో చెప్పకుండా హైద్రాబాద్  ఎందుకు బయల్దేరిందో , ఎక్కడ ఉందో నరేష్ కి అర్ధంకాదు. ఊళ్ళో వాళ్ళు మాత్రం, అమ్మానాన్నతో సహా, తను లేవదుసుకెళ్ళాడు అనుకుంటుంటారు.
ఊరోచ్చిన నరేష్ పరిస్థితుల నుండి బయట పడడానికీ, వచ్చిన అవకాశం వాడుకోడానికి, - ఇద్దరం ప్రేమించుకున్నాం - అని అబద్దం చెబ్తాడు. “దీనంతటికీ కారణం నువ్వే గనక ఆ అమ్మాయిని వెతికి పట్టుకోడానికి నువ్వుకూడా రా  “ - అని ఎవరికి తెలియకుండా ఆదితో సహా మళ్ళీ హైద్రాబాదు వస్తాడు హీరోయిన్ని వెతకడానికి.
వెతికే నేధ్యంలో, అవసరాతో భేటీ, ( పైవేట్ detective గా చెప్పుకుంటాడు అవసరాల), అమ్మాయి కోసం ముగ్గురూ వెతుకులాట, హీరోయిన్ ఇంటర్వ్యూ అని చెప్పిన కంపెని ఎప్పుడో ఎత్తేయడం, అసలు హీరోయిన్ ఎక్కడుందీ, హైద్రాబాద్ ఎందు కొచ్చింది, అసలు జరింగిందేవిటి - ఇదంతా second half లో పద్దతిగా నడుపుకొచ్చిన కధ.
 Director చిన్నవాడైనా, కధ మీద మంచి పట్టు చూపించాడు. అనవసరపు సన్నివేశాలు లేకుండా, అవసరమైనప్పుడే background music , ఇవన్నీ plan చేయడం Director కృషిని మెచ్చుకొనేలా ఉంటయ్ .
ఇప్పటి సమాజం లోని ఒక burning topic మీద కధ అల్లుకొని, దాన్ని tempo  చెడకుండా నడిపించాడు.
ఈ సినిమా ని entertainment కోసం తీసిందిగా చూడలేం. ఓ సందేశం ఉన్న సినిమా.
వాశి గాక రాసి కోసం సినిమాలు చూసే వాళ్ళుకూడా ఆనందించే సినిమా. వాశి కోసం వెతుక్కునే వాళ్ళు miss అవకపోడం మంచిది.
“ఎవరు చూసినా చూడక పోయినా…. 12 సం” నుండి 30 - 35 సం” మధ్య వయస్కులైన ఆడపిల్లలు (ఆడవాళ్ళు)  - Facebook,  Internet chatting లు అలవాటైన వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా.”  … ఇది నా మాట.
ఆ వయస్సులో ఉన్న ఆడపిల్లలు కలిగి ఉన్న తల్లిదండ్రులకి నాదొక చిన్న request - Smart phone లు, Tab లు, Laptop లు, Internet ఇన్ని ఇస్తున్న మీరు మరొక Rs. 100/-  లేక Rs 200/- ఖర్చు రాసుకొని ఈ cinema ticket కొనివ్వండి మీ అమ్మాయికి.
అప్పుడే ఈ Cinema  Director చేసిన ప్రయత్నానికి న్యాయం జరుగుతుంది.
(రా. శా.)

Comments

Popular posts from this blog

మృత్యువు కు చెక్

MMTS కధలు మృత్యువు కు చెక్ : చందానగర్ స్టేషన్ లో నేను ఎక్కాల్సిన MMTS బండి వచ్చి ఆగింది. టైమ్ చూసుకుంటూ బోగీ దగ్గరకి నడిచాను. బండి పావుగంట ఆలస్యం. ఇంకెక్కడా ఆలస్యం అవకుండా బండి నడిస్తే ఆఫీసుకు అయిదు నిముషాలు ముందు చేరుకుంటాను. లేదంటే బాసు పెట్టే నోటి వాతలకి సిద్దంగా ఉండాలి. అవును మరి, రచయిత జంధ్యాల గారికి కూడా తట్టని తిట్లు తిట్టగలడు మా బాసు. అంత కొత్తగా వేడిగా పడేవి మరి నోటి వాతలే కదా!  శరీరం మీది మామూలు వాతలైతే అంగీతోనో, పాంటు తోనో దాచుకోవచ్చు. కానీమా బాసు పెట్టే సెటైరిక్ శాడిస్టు నోటివాతలు, రెండు బదిలీల మీద రెండు ఆఫీసులు మారినా మర్చిపోలేం! బోగిలోకి ఎక్కి చక్రవర్తి కోసం చూసాను, ఎక్కడ ఉన్నాడా? అని. కన్పడలేదు. చక్రవర్తి MMTS బయల్దేరే స్టేషన్ లింగంపల్లిలో ఎక్కుతాడు. తనప్రక్క సీటు నా కోసం ఆపి ఉంచుతాడు. ఇద్దరం ఒకే ఆఫీసు అవడంతో మా MMTS పయనం రోజూ మూడు యధార్ధాలు, ఆరు పుకారుల కబుర్లతో నడిచి పోతోంది. ఎప్పుడైనా ఎవ్వరం సెలవు పెడుతున్నా రెండో వాళ్ళకి చెప్పుకుంటాం. “ ఈ రోజు ఏమైంది తనకి” అనుకుంటూ ఖాళీగా కనబడ్డ సీటులోకి శరీరాన్ని చేర్చాను. “మీ బెటర్ హాఫ్ ఏడి సర్ , కనబడ్డం లేదు?” -...

తన శాంతమె తనకు శిక్ష!

తన శాంతమె తనకు శిక్ష! పదేళ్ళ క్రితం: "ప్రభా, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సరిపడ డబ్బులున్నాయ్ ! మీ అమ్మగార్ని వచ్చి మనతో ఉండమనచ్చు కదా! అక్కడ ఒక్కరెందుకూ" భార్య యమున తన మనసులో మాట అన్నది భర్త ప్రభాకర్ తో. వెంటనే అమ్మకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకర్ . "మొన్ననే కదరా మీ పెళ్ళయింది. కొత్త కాపురంలో నేనెందుకురా పానకంలో పుడకలా" త్రోసి పుచ్చింది తల్లి. ****** తొమ్మిదేళ్ళ క్రితం: " ప్రభా, మనం ఈ బెడ్ రూమ్ మీ అమ్మ గారికే ఉంచుదాం. మిగిలిన దాన్లోనే మనం సర్దుకుందాం. అత్తయ్య గారికి చెప్పండి వచ్చేయమని మన దగ్గరకి" యమున తన ఆలోచన పంచుకుంది భర్తతో. " అదే చెప్పాను అమ్మతో. తొందరే ముందిరా? వస్తాన్లే అంటోంది" ప్రభాకర్ వివరణ భార్యకి. ****** ఎనిమిదేళ్ళ క్రితం: "ప్రభా మన చంటి దానికి సంబంధించిన వన్నీ మీ అమ్మగారి కోసం ఉంచిన గదిలో పెడుతున్నాను. ఆమె వచ్చినప్పుడు ఖాళీ చెస్తాను. మళ్ళీ అడగ రాదూ వస్తారేమో!" యమున. " అడిగాను. మొన్ననే పాప పుట్టింది కదరా, ఖర్చులు పెరుగుతుంటయ్ మీకు. మళ్ళీ ఆలోచిద్దాంలే అక్కడకి రావడం గురించి అంది అమ్మ" ప్రభాకర్ తెలిపాడు. ****** ఏడేళ్...
కిర్  కిర్   తలపులు నియమం: వ్రతాలు, రోజాలు, సువార్త కూటములు - ఆన్నింటిలో వ్యాపకం ఒకటే భజించడం .... దాగిఉందొక మూల వ్యాపకం తదుపరి భుజించడం