బేబీ టపాస్ :
" ఏంటి బావా నీ లాక్ డౌన్ అనుభవాలు ? " అడిగాడు పద్మం, బావ బ్రహ్మం ని ఫోన్ లో.
" రెండు నెలలు ఒకటే సినిమా చూసినట్టూ, ఒకే బోగీలో ప్రయాణం చేసినట్టూ ఉండింది. అంతా బాగనే అయిపోయింది అనుకో ఏ బాధా లేకుండా! మరి నీ సంగతో " అన్నాడు బ్రహ్మం.
" నాకూ అదే ఫీలింగు! కాకపోతే మా ఆవిడ అడిగే ఒక ప్రశ్నకి ఈ రెండు నెలల్లో ఒక్కసారీ సరైన సమాధానం ఇవ్వలేక పోయాను " చెప్పాడు పద్మం.
" ఏంటా ప్రశ్న ? చెప్పు! "
" ఏవండీ! కుక్కర్ ది ఆ వచ్చే విజిల్ ఎన్నోదీ? "
( రా. శా. )
Comments
Post a Comment