బేబీ టపాస్ :
తల్లి పదేళ్ళ కూతురుకు జడ వేస్తోంది.
ఎదురుగా టీ వీ నడుస్తోంది.
అందులో తెలుగు ఛానల్ లో క్రింద స్క్రోల్ అవుతున్న వార్తలు చదువుతోంది ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకుంటున్న కూతురు. తప్పులు చదువు తున్నప్పుడు సరిచేస్తోంది తల్లి!
జడ వేయడంలో నిమగ్నమైన తల్లికి కూతురు చెప్పింది విన్పించింది - "తాజ్ మహల్ కుట్ర ంపదం పతులు".
"ఏంటే… అర్ధం అయ్యేట్టు చదువు … సరిగా చూసి" టీవీలోకి చూడకుండానే అన్నది తల్లి తల మీద మొట్టుతూ.
"సరిగ్గానే చదువుతున్నా… కావాలంటే నువ్వే చూడు " తాజ్ మహల్ కుట్ర ంపదం పతులు " మళ్ళీ వల్లించింది కూతురు ధీమాగా.
తల్లి తలెత్తి టీ వీ లోకి చూసి చదివిన ఆ వార్త -
" తాజ్ మహల్ కు ట్రంప్ దంపతులు".
( రా. శా. )
Comments
Post a Comment