శోచ్ కే కరోనా ...
ఎన్నో శిక్షాస్మ్రతు లు రాసుకున్నాం
మానవ ప్రవర్తనను నియంంత్రించేంచుకు!
ఎన్ని మనోవికారాలు….
దొంగతనం, దోపిడీ,
హత్య, అరాచకం,
మోసం, మానభంగం,
కల్తీలు, కబ్జాలు,
అవినీతి, బంధుప్రీతి;
అన్నింటికీ శిక్షలు చట్టాల్లో నిక్షేపంగా!
చస్తావ్ అన్నా జరిగే నేరాలు నిర్భయంగా!!
అమలులో ఎన్ని వెసులుబాట్లు!!
జిల్లాకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు
అవసరమైతే క్షమాబిక్ష కూడా !
ఇప్పుడు ప్రకృతి వెసులుబాటు లేని
మారటోరియం లేని
మరణ శాసనం వ్రాసింది!
అమలు బాటను చూపిస్తోంది!
న్యాయస్థానాలు లేవు
న్యాయమూర్తులు లేరు
న్యాయవాదులు లేరు
వాదనలు లేవు
ప్రమాణాలు లేవు
సాక్ష్యాలు అక్కర్లేదు!
అన్ని వికారాలనూ దాచేసుకుంది
ఆకారం మనిషి ఇప్పుడు!
తనకు శిక్ష తనే అమలు చేసుకుంటున్నాడు!
చస్తావ్ అంటే ఎందుకో
చచ్చేంత భయపడుతున్నాడు!
కారణం ఒక్కటే -
వెసులుబాటు లేని అమలుబాటు!!
( రా. శా. )
Comments
Post a Comment