సాబిత్ కరోనా:
నిను నేలరాసే దెలాగో
నే వ్రాసి చూపిస్తున్నా!
నీ పీక నులిమే దెలాగో
నే గొంతెత్తి చెబుతున్నా!!
ఒక్కటిగా ఒంటరై
ఒంటరిగా ఒక్కటై
యుధ్దం చేస్తున్నాం!
గెలుపు బాట నడుస్తున్నాం!!
మా పట్టుదలలు
మా కట్టుబాట్లు
మమ్మల్ని గట్టి పరుస్తున్నయ్ !
నిన్ను కట్టి పడేస్తున్నయ్ !!
జీవ మకిలి
నీ జన్మస్థాన్ !
నా ఇంటి వాకిలి
నీ కబరుస్థాన్ !!
నీ గర్వం
అణిచేందుకు
నే సర్వం
వదులుకుంటున్నా!
మూక గా
నువు బలపడు తున్నావ్ !
ఏకాకి గా
నేను తలపడు తున్నాను!!
నీపై పోరాటం లో
మేమంతా కో వర్కరులం!
ఇల్లే సెల్యులార్ జైలు గ
మార్చుకున్న సావర్కరులం!!
Comments
Post a Comment