శ్వేతనాగులు:
దేశమంటే మనుషులోయ్
మనుషులంటే మనసులేనోయ్
దేశం గొప్ప నిలిపేది గొప్ప మనసులేనోయ్
గొప్ప దేశాల్లో గొప్ప మనసులుండట్లోదోయ్ !
నల్లవాని గొంతు నులిపేసింది
నల్లని ఓ మనసు!
చర్మం శ్వేతమైనా
మనసు మలినం!
గొప్ప మనసుల్లేక
దేశం గొప్పది అయ్యేనా!
తెల్లని ఆస్తులు కాలుతుంటే
నల్లని పొగేగా కప్పేస్తోంది!
నయనం రూపు తెలుపైనా
చూపును ఇస్తోంది నల్లని పాపేగా!
నలుపు లేక తెలుపుకు
విలువే లేదని
చెప్పక చెబుతున్నాయ్
పగలూ రాత్రులు!
మరి ఎందుకు పగ లు
తెలుపూ నలుపుల నడుమన!
నలుపంటే పడని
తెలుపు కు తెలపాలి!
నలుపు నీలోనే ఉందని
నీ మనసే తన్నుకొచ్చి
నల్లని నీ నీడై నిలిచిందని!
అది తెల్లబడక
నలుపు నిన్ను విడిచిపోదని!
( రా. శా. )
Comments
Post a Comment