MMTS కధలు - విడుదల:
ఆరోజు నాకు చందానగర్ MMTS స్టేషన్ చేరడంలో ఆలస్యం అయింది. నా కళ్ళ ముందే నేను ఎక్కవలసిన MMTS ప్లాట్ ఫాం మీదికి వస్తోంది. బండి పార్కింగ్ లో పెట్టే సమయం కూడా లేదు. ప్రక్క స్టాండ్ మీద నుంచో పెట్టి, తాళం వేయకుండా తాళంచెవి చేత పట్టుకొని, బండిని స్టాండ్ లో పెట్టేయడానికి పార్కింగ్ నడిపే కుర్రాడికి “ పార్కింగ్ లో పెట్టేసేయ్ , బండి వచ్చేసింది” అని చెప్పుకుంటూ ప్లాట్ ఫారం మీదికి పరుగు లంఘించాను.
ఆలస్యం అయినప్పుడు అలా తాళం వేయకుండా చెప్పేసి వెళ్ళడం ఒక రివాజు, పార్కింగ్ పాస్ ఉన్న వాళ్ళకుండే ప్రివిలేజ్ . తాళం "మా దగ్గర ఉంచద్దు” అనడం పార్కింగ్ నడిపే వారి నిజాయితీ, నిబద్ధతకి నిదర్శనం.
నేను ఎప్పుడూ ఎక్కే, బోగీ చాలా ముందుకు ఉండడంతో నా పరుగులాంటి నడకను తగ్గించుకొని దగ్గరలో ఉన్న బోగీలో ఎక్కేసి ఖాళీ ఉన్న సీటులో కూర్చుండి పోయాను. బండి బయలు దేరడానికి కూత వేసింది. నా బ్రీఫ్ కేసులో ఉండే దినపత్రిక నా చేతికి చేరింది.
కొద్ది సేపటికి బండి హఫీజుపేట స్టేషన్ చేరింది.స్టేషన్ గేటు లో నుండి తల్లీ కూతుళ్ళ వయసులో ఉండే ఇద్దరు ఆడవాళ్ళూ, వెనకాలే ఒక మగ వ్యక్తి బండి వైపు పరిగెట్టు కుంటూ వచ్చారు. కిటికీ లోంచి వాళ్ళనే గమనిస్తున్న నాకు ఆ తల్లి లాంటి స్త్రీ, ఆ అమ్మాయి చేతిని గట్టిగా వదలకుండా పట్టుకున్న రీతిలో ఉండడం నా కంటిని దాటి పోలేదు. పరుగు పరుగున వచ్చి ఆ పురుషుడు, స్త్రీ, పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసున్న అమ్మాయి ముగ్గురూ వచ్చి నేను ఎక్కిన బోగీ లోకే ఎక్కారు. ఆడవాళ్ళు ఇద్దరూ బురఖాలు ధరించి ఉన్నారు, కానీ ముఖం మాత్రం కప్పబడి లేదు. నాకు ఎదురుగా ఉన్న సీటులో ఆ అమ్మాయి, ప్రక్కనే ఆమె, మూడో సీటులో పురుషుడు కూర్చున్నారు.
“సాబ్ , యే గాడీ ఫలక్ నుమా జాతీ నా?” అడిగింది ఆ స్త్రీ నన్ను.
“ హవ్ …. జాతీ “ పక్కా హైదరాబాదీ భాషలో బదులిచ్చాను. ఎక్కడకు వెళ్ళే బండినో చూడకుండా ఎక్కడం వలన నా సమాధానం ఆమెకు ఊరట నిచ్చినట్లు గమనించాను.
ప్రక్క స్టేషన్న్లు వచ్చేలోపు నేను ఆ ముగ్గురిలో గమనించిన మిగిలిన విషయాలు -
“ఆ పురుషుడు ఏమీ మాట్లాడడం లేదు!
ఆ అమ్మాయి అయిష్టంగా వాళ్ళ వెంట వెళ్తోంది!
వాళ్ళు ముగ్గురూ ఒకే కుటుంబం వాళ్ళు…. భార్యా, భర్త, కూతురూ!
ఆమె ఇష్ట ప్రకారమే ఆ ప్రయాణం అంతా నడుస్తోంది!”
“అబ్బా…. జర పెన్ దేనా” అంటూ ఆ అమ్మాయి తండ్రిని అడిగింది.
“చుప్ భైటనా… క్యా కరోగే అబ్ పెన్ సే” అని తల్లి అంటుండగానే, ఆయన ఆ అమ్మాయి కి జేబు లోంచి పెన్ తీసి ఇచ్చాడు.
ఇదంతా నేను చూస్తున్నట్లు ఆ అమ్మాయి గమనిస్తోంది.
పెన్ను కుడి చేత్తో తీసుకొని, ఎడమ చేత్తో వాళ్ళ అమ్మ ఎడమ చేతిని తన ఎడమ తొడ మీద ఉంచుకుంది.
“క్యా కర్ రహీ హో!” అడిగింది వాళ్ళ అమ్మ.
“దేఖోనా” అంటూ, ఆమె చేతి బొటన వేలు పై భాగంలో నవ్వుతూ ఉండే ముఖం గీసి, “ఏ తుమ్ “ అంది.
తల్లి సంతోషించింది. చూపుడు వేలు తీసుకుని పై భాగంలో మగమనిషి ముఖం గీసి “ ఏ అబ్బా జాన్ “ అంది. కానీ ఆ బొమ్మ ముఖం నవ్వడం లేదు, ఎందుకంటే దానికి నోరు పెట్టలేదు.
“క్యోం… అబ్బా కో జుబాన్ నై క్యా? ఖుష్ నహీ క్యా? “ అని చెయ్యి లాగేసుకుంది తల్లి.
కాసేపు వాళ్ళ మధ్య మౌనం….
తండ్రి కళ్ళు మూసుకు కూర్చున్నాడు.
మెల్లగా తల్లి కూడా కళ్ళు మూసుకు కూర్చుంది.
ఆ అమ్మాయి తన ఎడమ చేతి అయిదు వ్రేళ్ళ మీద ముఖాలు గీస్తోంది. నేను తను చేసే పని చూడడం ఆ అమ్మాయి గమనిస్తోంది. అయిదు ముఖాలూ ఏడుపు ముఖాలే!
తల్లి వైపు చూసింది, కళ్ళు మూసుకొనే ఉంది ఆమె.
ఈసారి నా వైపు చూసింది. చూడ్డమే కాదు… తను గీసిన అయిదు ఏడుపు ముఖాలూ నాకు కనపడేటట్లు ఉంచింది.
నాకు ఆశ్చర్యం, కుతూహులం ఒక్కసారే కలిగినయ్ !
ఆ అమ్మాయి తల్లిదండ్రులిద్దరు కళ్ళు మూసుకొనే ఉండడంతో “ఆ ముఖం ఎవరిది?” అన్నట్లు సంజ్ఞ చేశాను చేత్తో.
తనదేనని తన జవాబు సంజ్ఞల్లో.
అరచేతిలో ఏదో వ్రాస్తోంది ఆ అమ్మాయి.
తన దు:ఖానికి కారణం ఏమై ఉండచ్చని ఆలోచనలు నాలో.
వ్రాయడం పూర్తి చేసి వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూసింది.
వాళ్ళు చూడడం లేదని నిర్ధారించుకొని చేయి ముందుకు చాచి నాకు చూపించింది అరచేతిలో తను వ్రాసింది.
“Help me. They sell me.” అని వ్రాసింది. చదివిన నాకు ఒక్కక్షణం మెదడుపని చేయడం ఆగి పోయింది.
అది నేను అస్సలు ఊహించనిది. ఒక సానుభూతి, భయం నా మనసులో ఒకేసారి కల్గినయ్ .
ఆశ్చర్యంతో ఆ అమ్మాయి ముఖం లోకి చూశాను. ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్ళు.. ఒకటి ఒకటి గా జారి గులాబీ రంగు బుగ్గల మీదగా చేతి మీద గీసిన ఏడుపు ముఖాల మీద నిలుస్తున్నయ్ .
“ఎంత కష్టం! ఎంత కష్టం! చిన్న తల్లికి…” నా మనసు ఆలపించింది. మరుక్షణం ఆ అమ్మాయిలో మా చెల్లి, అదే వయసుండే మా అన్నయ్య కూతురూ కనిపించారు. నా ఆలోచనలు వేగం అందుకున్నాయి.
బయటకి చూశాను, బేగంపేట స్టేషన్ లోకి బండి చేరుతోంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు నిద్రలో ఉండడం చూశాను.
లేచి, ఆ అమ్మాయి తల నిమిరి భయపడద్దని చేతులతో సంజ్ఞ చేసి, ఆ బోగీ లో నుండి దిగి ప్రక్క బోగీలో ఎక్కాను.
ప్రక్క బోగీ ఎక్కగానే సెల్ బయటకి తీసి యాప్ లు అన్నీ వెదికాను. కావల్సిన యాప్ దొరికింది.చక చకా మెసేజ్ లు పెట్టాను.
*****************
మా MMTS బండి సికింద్రాబాద్ స్టేషన్ లో వచ్చి ఆగింది. మామూలు కంటే కొంచెం ఎక్కువ సేపే ఆగింది. ఒక రైల్వే పోలీసు SI, మరో ముగ్గురు మహిళా పోలీసులతో వడివడిగా నడుచు కుంటూ ఆ ముగ్గురూ ఉన్న బోగీ ఎక్కారు. ఏం జరుగుతుందో తెల్సుకోడం కోసం నేను ఆ బోగీ వైపుకు వెళ్ళాను.
ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలిసులతో ఏదో వాదిస్తున్నారు. SI ఆ అమ్మాయితో మాట్లాడు తున్నాడు. ఇంతలో తల్లిదండ్రు లిద్దరూ ఆ అమ్మాయి మీద దాడికి దిగారు. మహిళా పోలీసులు అడ్డుకున్నారు. కొద్ది సేపటి వాదులాట తర్వాత, ఇద్దరు మహిళా పోలీసులూ ఆ అమ్మాయి తల్లినీ చేతులుపట్టి బోగీనుండి బయటకి తెచ్చారు. వెనకాలే తండ్రిని చేయి పట్టుకొని SI దింపాడు. మరో మహిళా పోలీసు చేయి పట్టుకొని ఆ అమ్మాయి దిగింది. దిగుతూనే ఆమె కళ్ళు వెతుకు తున్నయ్ , అది నా కోసమేనని నాకు అర్ధమైంది. గుంపు లో నుండి కొంచెం ముందుకు వచ్చాను. ఆ అమ్మాయి నన్ను చూసింది. పరుగున వచ్చి నా కాళ్ళకు నమస్కరించింది. తన కళ్ళు వర్షిస్తున్నాయ్ . తనని పైకి లేపి తన ధైర్యాన్ని మెచ్చుకుంటూ భయపడద్దని చెప్పాను. మరోసారి నాకు నమస్కరించి మహిళా పోలీసును అనుసరించింది.
నా మనసు తేలిక పడింది.
*********
ఆ రోజు రాత్రి టీవీ లో వార్తలు చూస్తున్న నాకు కంట పడిన వార్త……” నగరం లో మైనర్ ఆడపిల్లల్ని బలవంతంగా పెళ్ళి పేరున అరబ్ షేక్ లకు విక్రయిస్తున్న ముఠా అరెస్టు. ఆరుగురు ఆడ పిల్లల చెర విడుదల”.
వారిలో మొట్టమొదట చూపించినది నాతో పాటుగా MMTS లో నా ఎదుట కూర్చున్న మా అన్నయ్య కూతురు లాంటి అమ్మాయినే.
& & & & & & & & & & & & & & &
( రా. శా. )

Comments
Post a Comment