నేనెరిగిన దసరా:
“బుచ్చయ్య పంతులు” - ఇది ఆయన పేరు. పిల్లల చదువు విషయంలో చండశాశనుడు.
“బుచ్చయ్య పంతులు బడి” ఆయన పాఠశాల పేరు. ఆ పాఠశాలలో అన్నీ ఆయనే … మాష్టారు, హెడ్ మాష్టారు, వగైరా.. వగైరా. “పిల్లలకి దండోపాయంతో మాత్రమే చదువొస్తుంది “ అనే ఏక సూత్రంతో “చదువు చెప్పడం “ అనే వృత్తి నడుపుతుండేవాడు.
ఆయన పేరు చెబితే చాలు - పిల్లలు బట్టలు తడిపేసుకుంటారు.
బడికి వెళ్ళని పిల్లల్ని ఆయన బడికి పంపిస్తామని బెదిరిస్తే దెబ్బకి నోరుమూసుకుని బడికి వెళ్ళడం మొదలు పెడ్తారు.
రమేష్ సిప్పీకి ఎలా తెల్సి ఉంటుంది ఇలా భయపెడ్తారని, ఈ concept మీద “షోలే” లో పెద్ద సంభాషణ వ్రాసాడు గబ్బర్ సింగ్ మీద - అని నాకు చాలాసార్లు అనుమానమొచ్చింది కూడా.
దసరా అంటూ బుచ్చయ్య మాష్టారు గురించి చెబుతున్నాడేంటి అనుకోకండి. అసలు విషయానికొస్తే - ఈ బుచ్చయ్య పంతులు గారు దసరా రోజుల్లో ఆయన దగ్గర చదివే పిల్లల్ని వేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పిల్లల చేత పద్యాలు గట్రా చెప్పించి దసరా మామూళ్ళు వసూలు చేసుకొనేవారు.
ఎవరింటికి ఏ రోజు వస్తున్నారో ముందుగానే చెప్పి ఉంచే వాళ్ళు.
ముందు బుచ్చయ్య పంతులు గారు, వెనకనే ఆయన శిష్యగణం.
పంచ కట్టు, లాల్చీ, చేతిలో కేన్ బెత్తంతో గంభీరం గా నడిచే ఆయన్ని గురించి విన్న పిల్లలు(ఆయన దగ్గర చదవని వాళ్ళు) ఆయన కి ఎదురుగా వెళ్ళడానిక్కూడా
భయపడ్తారు.
కానీ చేతిలో విల్లంబులు, డబ్బాలో గులాల్ , బుక్కాలతో కొంతమంది, తాడు లాగితే కాళ్ళూ చేతులూ పైకి లేచే కోతి బొమ్మలతో మరికొంత మంది పద్యాలు పాడుతూ ఆయన వెనకాలే వెళ్తూంటే రోడ్డు ప్రక్కన నిలబడి, దగ్గర్లో ఉన్న అరుగులు ఎక్కి , చూడడం దసరా సరదాల్లోని ఒక మహదానందకరమైన విషయం.
“ఏదయా మీదయ మామీద లేదు!
ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!”
అంటూ మొదలై….
“పావలా బేడైతె పట్టేది లేదు!
అర్థరూపాయైతె అంటేది లేదు!
ముప్పావలైతేను ముట్టేది లేదు! “
అంటూ సాగుతూ..,,
“అయ్య వారికి చాలు ఐదు వరహాలు!
పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!
మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!
శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!”
అంటూ చివరి చరణం వరకు వాళ్ళు పాడుతూ విద్యార్ధుల ఇళ్ళకి వెళ్ళడం, పిల్లలు పప్పు బెల్లం, నిమ్మతొనలు, పిప్పరమెంటు బిళ్ళలు పంచుకోడాలు, బంక బంక అయిన చేతులు లాగూలకి గోడలకి పూసెయ్యడాలూ ఇంకా కళ్ళ ముందు మెదులు తున్నాయి.
ఇంకా…...
దసరా పండుగ రోజుల్లో వచ్చవేద పండితులు, ఘనాపాటి లు ఇంట్లో కూర్చొని ముక్త కంఠంతో పలికే వేదఘోష, ఆశీర్వచనాలు, భోజనాలు చేశాక ఇంటిల్లిపాదికి ఇచ్చే దీవెనలు, ఆశీర్వచనాలు…
కూచిపూడి నుంచి వచ్చిన భాగవుతులు, పగటి వేషగాళ్ళూ దసరా పదిరోజులూ వివిధ వేషధారణలతో ఇంటి ముందు ఆగి చేసే అభినయాలు, విచిత్ర సంవాదనలు ( ముఖ్యంగా అత్తా కోడళ్ళుగా, మొగుడు పెళ్ళాలుగా ) ఇంటిల్లి పాదికి గొప్ప వినోదం, పిల్లలకి భాషా పరిజ్ఞానం పెంచే విషయాలు. వాళ్ళ వెనకే వాళ్ళతో పాటు వాళ్ళనే ఆశ్చర్యంగా చూస్తూ రెండు మూడు వీధులు చుట్టేసే పిల్లలు……
అమ్మ చేయి పట్టుకొని వెళ్ళి శివాలయంలో అమ్మ వారికి ఆ రోజు వేసిన అలంకారం గురించి తెలుసుకొనే చిన్నారులు….
ఇంట్లో బొమ్మల కొలువు పేరంటానికి తన ఫస్ట్ క్రష్ వచ్చిందో లేదో వెతుక్కునే కౌమారులూ….
మరొక్కసారి కళ్ళముందు తారాడుతున్నారు.
ఈమధుర జ్ఞాపకాలన్నింటికీ మరో తూరి వందనం…
( రా. శా. )
ా

Comments
Post a Comment