ఉయ్యాల చెట్టు:
ఉద్యోగం చివరి దశలో ప్రమోషన్ , దాంతో పాటుగా తాతయ్య అమ్మమ్మ గారి ఊరికి బదిలీ రెండూ ఒకేసారి వచ్చాయ్ రమణకి.
ఇప్పుడైతే అక్కడ అయిన వాళ్ళెవరూ లేరు గానీ, అంతకంటే ఎక్కువైన అనుబంధం ఉంది ఆ ఊరితో తనకి.
చిన్నతనం లోని ప్రతి ఎండాకాలం సెలవులు ఆ ఊరిలోనే.
మామయ్య ఉద్యోగరిత్యా 40 ఏళ్ళ క్రితమే ఆ ఊరు వదిలి వచ్చేశాడు, తర్వాత తాతయ్య వాళ్ళు కూడా ఉన్న ఇల్లు, కాస్త పొలము అమ్మేసుకొని మామయ్య దగ్గర కొచ్చేశారు. మొదట్లో ఏదో ఒకటి అరా పెళ్ళిళ్ళకి మామయ్య వెళ్ళి వచ్చేవాడు, ఒక పది సంవత్సరాలుగా అదీలేదు.
***********
జాయిన్ అవడానికి రైల్లో వెళ్తున్న రమణకి తాతగారి ఊరు ఙ్ఞాపకాలు తరుముకొచ్చాయి.
తన వయసు చడ్డీల్లోంచి ప్యాంటుల్లోకి, మామయ్య కూతురు లలిత (ఇప్పుడు తన అర్ధాంగి) వయసు ఫ్రాకుల్లోంచి పరికిణీల్లోకి వచ్చేసేందుకు పట్టిన కాలమంతా ఆ ఊరుతోనే అనుబంధం.
కృష్ణానది పాయ ఒకటి ఆ ఊరు నంటు కొని ప్రవహిస్తూంటుంది పడమర నుండి తూర్పుకు. సూర్యోదయాస్తమానాలు రెండూ కృష్ణవేణమ్మ ఒడిలో చూడగలిగే తీరం.
తూర్పున ఉదయభానుడు వరాహావతారంలో సముద్రం లో నుండి పైకి లేస్తున్న భూగోళం అయితే, సంధ్యా సూర్యుడు భూమి లోకి దిగి పోతున్న బలి చక్రవర్తి తల.
ఊరి వాళ్ళందరికి నీటి వసతి అంతా ఆ నదీపాయ నుంచే.
నదికి అవతల వైపు పుష్కలమైన పంట పొలాలు, కొండలు.
ఇవతల ఒడ్డున - నదిలోకి దిగుడు మెట్లు.
మెట్లని ఆనుకొని బట్టలు ఉతుక్కునే బండలు.
కొంచెం ఎగువన మంచి నీళ్ళు పట్టుకొనేందుకు గట్లు.
మెట్లకి దగ్గర్లోనే పేద్ద రావి చెట్టు. ఆచెట్టు దూరం నుంచి ఒక తెరిచి ఉంచిన దేవుడి రధం మీది ఛత్రంలా ఉంటుంది. కొమ్మలు, ఆకులు దట్టంగా విస్తరించి ఎంత ఎండైనా ఆ చెట్టు కింద నీడగా మారిపోతుంది.
గాలికి కదిలే లేత రావి మారాకులమీద దోబూచులాడే ఎండ మెరుపులు కెమేరా ఫ్లాష్ ల్లాగా తళుక్కుమంటుంటాయి.
చుట్టూ వర్షం పడుతున్నా చెట్టు కింద ఉన్నవాళ్ళు మాత్రం తడిసే ఊసుండదు.
తొలి ఋతుపవనాల రోజుల్లో నల్లటి మబ్బులు, చల్లటి గాలులతో చెట్టు చుట్టూరా A. C. లు పెట్టినట్లన్పిస్తుంది.
దూరంగా పచ్చటి పొలాల మీద నిలిచే వరదగుడి.
పైరగాలి ప్రకృతికి తాంబూలం.
ఆ ప్రకృతి శోభ ఆ ఊరు వాళ్ళ మీద అసూయ పుట్టేంత రమణీయం.
రావిచెట్టు మొదల్లో సిమెంటుతో కట్టిన పెద్ద దిమ్మ.
మంచి నీళ్ళకి, బట్టలుతుక్కోడానికి వచ్చిన పడతుల కబుర్ల సందడి, కొత్తకోడళ్ళ పరిచయాలు, పుట్టింటికొచ్చిన ఆడబిడ్డల పలకరింపులు అన్నింటికీ వేదిక అదే.
మామయ్య తనకు కొనిచ్చి, నేర్పించిన సైకిలు మీద ఆ ఊరు వీధుల్లో తిరగడం, దానిమీద మామయ్య కూతురు లలితని, పిన్ని కూతురు మంజరిని కూర్చో పెట్టుకొని ఇంటి నించి రావిచెట్టు దాకా తొక్కడం, తోటి మగపిల్లలకి సైకిల్ తొక్కడం నేర్పడం.. ఇవన్నీ ఆ ఊరితో తనకు ఉన్న మధురానుభూతులే.
వీటన్నింటి కంటే మనోరంజకమైన దృశ్యం - ఆ చెట్టుకు వేసిన ఉయ్యాలలు, వాటి మీద ఊగే పిల్లలు. పిల్లలు అంటే వయస్సుతో మాత్రమే ముడి పెట్టకుండా, మనసు ఊగమన్నందుకు ఊగే పిల్ల మనసు వాళ్ళు.
కొన్ని నేలకు దగ్గర్లో ఉన్న కొమ్మలకు వేసినవి , కొన్ని చిటారు కొమ్మలకు వేసినవి.
పిల్లల కోసం గుడ్డ తొట్టెల ఉయ్యాలలైతే, పెద్దవాళ్ళ కోసం చెక్క పీటల ఉయ్యాళ్ళు.
పెద్ద పెద్ద ఊపుల కోసం పీటకి తాడు, అది పట్టుకుని ఊపేవాళ్ళ బలం, పొడుగు మీద ఆధారపడి ఊపు ఎత్తు.
ఒక్కోసారి ఊగే వాళ్ళకి, ఊపేవాళ్ళకి మధ్యన పోటీ కూడా వచ్చేది.
నిలబడి ఊగే వాళ్ళు కొందరైతే, జంటగా ఊగేవాళ్ళు కొందరు.
ఎవరి సాయం లేకుండా నిలబడి కాళ్ళతోనే ఊపు తెచ్చుకొని ఎత్తుకు ఊగే వాళ్ళ కళ్ళల్లో గర్వం, ఉత్సాహం చూసి తీరాల్సిందే.
ఆడపిల్లలు ఊగేటప్పుడు గొడుగులా తెరుచుకొనే గౌనులు, పరికిణీలు - వాటిని సర్దుకుంటూ వాళ్ళు పడే అవస్థలు, పరికిణీని దోపి ఊగే వీరనారులు, జండాలా ఎగిరే ఓణీ, ఊగే జడ కుచ్చులు - అన్నీ కళ్ళకి ఇంపైన దృశ్యాలే.
అట్లతద్దె రోజు ఆడ పిల్లలు, కన్యలు, ముగ్ఢలు, ప్రౌఢలు, ముత్తయిదువుల ఉయ్యాల సంబరాలకి ఆ చెట్టే పులకించి పోతుంది.
కొత్త స్నేహాలు ఏర్పడ్డం, ఉన్నవి బలపడ్డం, కొత్త దంపతుల మధ్య చనువు పెరగడం, కొన్ని చూపులు కలవడాలు, మనసులు పెనవేసుకోడాలు - ఇన్ని అనుభూతులకు మౌన సాక్ష్యం ఆ ఉయ్యాల చెట్టు.
మనుష్యులు లేకుండా ఉయ్యాలలు మాత్రమే గాలికి నెమ్మదిగా కదులు తున్నవి చూసినప్పుడు మాత్రం ఏదో వెలితిగా, గుబులు గా, దుఃఖం గా, మనసుకు మాంద్యం వచ్చినట్లుండేది.
ఉయ్యాల కూడా జీవిత వేదాంతాన్ని తెలుపుతుందనిపిస్తుంది. పైకి వెళ్ళేది ఉథ్థానమైతే, క్రిందకి వచ్చేది పతనం… రెండూ ఉన్నదే జీవిత గమనం. ఎత్తుకు ఎగసేటప్పుడు పొంగి పోవద్దు… క్రిందకి జారేటప్పుడు కృంగి పోవద్దు… ఒకదాని వెనుక ఇంకొకటి. ఆ రెంటినీ సమానంగా తీసుకోగలిగినప్పుడు జగమే ఊయల అనే వేదాంతం బోధిస్తోంది కాబోలు.
************
ఊరు చేరే సరికి చీకటి పడింది. ముందుగానే book చేసుకున్న guest houseలో బస చేసాడు. అతనిమనసు చిన్న పిల్లాడిలా ఉయ్యాలచెట్టు చూడమని వేధిస్తోంది. చీకటి పడ్డంతో ఆ కోరికని మర్నాటి ఉదయం వరకు వాయిదా వేయక తప్పలేదు.
మర్నాడు ఉదయమే లేచి ఎటుగా వెళ్ళాలో తెల్సుకొని నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ చుట్టూ కలయచూస్తూ గమనించాడు - ఊరు రూపు రేఖలన్నీ మారిపోయాయి. తన ఙ్ఞాపకాల్లో ఉన్న ఊరు కాదది.
తనకు తెల్సిన కృష్ణమూర్తి కొట్టు, ఉస్మాన్ బొగ్గుల దుకాణం, కట్టెల అడితి, దాని పక్కనే ఉండే సాంబయ్య సైకిల్ షాపు, మంగలి వెంకటేశ్వర్లు సెలూన్ …. వెతుకుతున్నదేదీ కనబడట్లేదు తనకి.
తాతయ్య Postmaster గా తన ఇంట్లోనే Post Office నడిపేవాడు. దానికోసం వెతికాడు… అది ఇప్పుడు ఓ complex గా మారి పోయింది.
గుర్తున్న చిన్ననాటి పేర్లు వాకబు చేయగా చేయగా అతికష్టం మీద తన స్నేహితుడు రాఘవ వాళ్ళ తమ్ముడు దొరికాడు.
కాసేపు ముచ్చటించాక అతను నదివైపు వెళ్ళే దారి చూపించి అన్నాడు “ నే చెప్పడం కంటే మీరు స్వయంగా చూస్తేనే తెలుస్తుందిలేండి”.
ఆ దారి వెంటే వెళ్ళిన రమణకి కొంతదూరం వెళ్ళాక ఓ Engineering College కనిపించింది.
అక్కడి కాపలాదారు చెప్పాడు- మీరు వెతికే నది ఎప్పుడో ఎండి పోయింది. దాన్ని కబ్జా చేసుకుంటూ ఆ ఊరి జనాలు ఈ ఊరులోకి వచ్చేసారు. మా ఊరి పొలాలకి మంచి రేట్లొచ్చి కాలేజి, కాంప్లెక్సులుగా మారి పోయాయి.
మీరు మీ ఊరు దాటి ఒక కిలో మీటరు మా ఊరిలో కొచ్చేసారు.
మరి ఆ దూరంగా ఉండే కొండ?
అది స్థానిక MP గారు పెట్టిన క్వారీ వల్ల ఎన్నో రహదారులకి కంకరగా మారింది!
ఉయ్యాల చెట్టు అడితి పాలయ్యింది.
కాళ్ళు భూమిలోకి కూరుకుపోతున్న భావన.
వింటున్నవన్నీ జీర్ణించుకోడం కష్టం అవుతున్న సమయంలో రమణకి ఫోను….
“ వెళ్ళారా అక్కడకి? ఎలా ఉందండీ మన ఉయ్యాల చెట్టు?” అవతల నుండి లలిత ఆత్రుత.
“ ఉయ్యాల చెట్టు పదిలం… మన ఙ్ఞాపకాల్లో”
(అశ్వత్ధామ హతః …… కుంజరః).
ఒకనాటి ఉద్యాన వనము....
నేడు కనమూ.... కాలేజి వాచ్ మెన్ సెల్ ఫోన్ మోగుతోంది.
వెనక్కి తిరిగి Guest Houseకి వచ్చి తయారై Office కి వెళ్ళి Joining Report బదులు వేరే ఊరికి Request Transfer apply చేసి ఇంటికి తిరుగు ముఖం పట్టడానికి రమణకి కొద్ది గంటలే పట్టింది.

Comments
Post a Comment