దేవుడొచ్చాడు
“అమ్మా! మేళం యిన్పిస్తంది. దేవుడొచ్చేత్తన్నాడు” పరిగెత్తుకుంటూ గుడిసెలోకి వచ్చి నరిసి ని అడిగాడు మూడేళ్ళ కొడుకు ముత్యం.
“వత్తాడు…. నువ్వు ఎదురెళ్ళకు రోడ్డు మీకి. రతం వొత్తది. దానికి పెద్ద పెద్ద సెక్రాలుంటయ్ . మన బాయి గట్టుకాడే నిలబడి సూడు. మన ముందు నుంచే ఎలతది… బాగా అవుపిస్తార్లే ఈడ నుండే అమ్మోరూ, దేవుడు” పాలు గ్లాసులో పోస్తూ చెప్పింది నరిసి .
ముత్యం బయటకి వెళ్ళ బోతుంటే మళ్ళి తనే అంది “ ఈ పాలు తాగేసెళ్ళి కూకో గట్టుకాడ. రతం దగ్గరొచ్చినప్పుడు సెప్పు. నేనొత్తా”.
ముత్యం గబగబా పాలు తాగేసి గ్లాసు అక్కడే పడేసి బయటకి పరిగెత్తాడు.
ఆ వీధిలో మున్సిపాలిటీ వాళ్ళు కట్టించిన ఒక బావి ఉంది. ఒకప్పుడు దాన్నిండా పుష్కలంగా నీళ్ళు. ఆ చుట్టుప్రక్కల రెండు మూడు వీధుల వాళ్ళు వచ్చి నీళ్ళు తోడుకునే వాళ్ళు. కాలక్రమేణా మున్సిపాలిటి పంపుల ద్వారా మంచినీరు ఇళ్ళల్లోకే రావడం, ఎండలు పెరగడం, నీటి నిలవలు పడిపోవడం వీటన్నిటి కారణంగా ఆ బావి వాడకం నిలిచి పాడుబడి పోయింది. మున్సిపాలిటీ వాళ్ళు నాలుగు వైపులా పెట్టించిన ఇనప కమ్మీలు, గిలకలు ఎవరి కడుపులు నిండడానికో ఉగయోగ పడ్డయ్ . ఆ బావి దిక్కు చూసే వాళ్ళుకూడా లేరిప్పుడు.
అదే నరిసికి ఉపయోపడింది. బావికి ఒకప్రక్క ఉన్న సిమెంటు దిమ్మలు ఆధారంచేసుకొని నిలుస్తోంది నరిసి గుడిసె.
ఆ గుడిసెలో ఉండేది వాళ్ళిద్దరే.. నరిసి, నరిసి కొడుకు ముత్యం. అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటాడు సుందరం.
ముత్యం, సుందరం కి నరిసి కి పుట్టిన బిడ్డ. సుందరం ముత్యంకి తండ్రేకాని నరిసి కి మొగుడు కాదు, తోడైన మగాడు.
సుందరం ది పక్కనే ఉండే పల్లెటూరు, కాంట్రాక్టర్లకి పనులకోసం కూలీలని ఏర్పాటు చేసే లేబర్ కాంట్రాక్టరు దగ్గర అసిస్టెంటుగా పని. పెళ్ళయి ముగ్గురు పిల్లలు, అందరూ ఆడపిల్లలే. ఒక రోడ్డు కాంట్రాక్దు పనిలో పనికోసం వచ్చిన నరిసి తో పరిచయం, మెల్లగా చనువు, స్నేహం ఏర్పడ్డాయి.
నరిసి ది ఆ ఊరుకాదు, ఆ మాటకొస్తే అసలు ఆ జిల్లానే కాదు. తెలిసీ తెలియని వయసులో ప్రేమ, ఇంట్లోంచి వచ్చేయడం, పెళ్ళి, ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాడిది ప్రేమకాదని మోసపోయానని తెలుసుకోడం - అన్నీ రెండు సంవత్సరాల కాలంలో జరిగిన నరిసి జీవిత విశేషాలు.
నరిసికి జీవనోపాధి కావాలి, అది సుందరం వల్ల దొరికింది. సుందరంకి కొత్త అనుభవం కావాలి, అది నరిసి రూపంలో ఎదురొచ్చింది. వాళ్ళిద్దరిదీ ఒక అవసరం, ఒక అవకాశం కలిసి చేసే సహజీవనం. ముత్యం పుట్టడంతో అది మరింత బలపడింది. అంతకు మించి వాళ్ళ సహజీవనం లో వేరే నిబంధనలేం లేవు.
ముత్యంని కడుపుతూన్నప్పటి నుండి కూలి పనులకి వెళ్ళడం మానేసింది నరిసి. ఈ ఊళ్ళోనే ఎక్కవ పనులు కూడా ఉండడంతో నరిసి మకాం ఇక్కడకి మార్చేశాడు సుందరం. కొద్దిరోజులు ఒకచిన్న గదిలో ఉన్నా, తర్వాత్తర్వాత సుందరంకి నరిసికి ఉన్న సంబంధం తెలిసి ఖాళీ చేయించేసారు ఆ వీధి జనులు. నిలువ నీడ లేక చివరికి ఆ వీధి బావిని ఆశ్రయించింది.
ముత్యం పుట్టిన తర్వాత చంటి వాడ్ని వేసుకొని కూలి పనులకెళ్ళలేక, చుట్టుపక్కల నాలుగైదు ఇళ్ళల్లో పనులకి కుదిరింది. అట్లా వచ్చే డబ్బులతో పిల్లడిని సాకుతోంది.
“అమ్మా రతం మన దగ్గరకొచ్చేత్తంది… నువ్వు రా..” బయటనించి ముత్యం మాట వినబడుతూనే బయటకొచ్చింది నరిసి. రావడంతోనే చంక కెత్తుకుంది పిల్లడి ని.
బావికి యాభై అరవై మీటర్ల దూరంలో రధం ఉంది. పది పన్నెండు మంది దాకా రధాన్ని లాగు తున్నారు. లాగే వాళ్ళ కి ముందు మేళగాళ్ళు, వాళ్ళ కంటే ముందు టపాకాయలు పేల్చేవాళ్ళు.
సరిగ్గా బావి ఎదురుగా టపాకాయలు పేలు తున్నయ్ , సిసాలో పెట్టి కొంతమంది, చేతుల్తోనే కొంత మంది రాకెట్లు కాలుస్తున్నారు.
అంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ముత్యం. ఇంతలో ఒకడొచ్చి చిచ్చుబుడ్డి వెలిగించడానికి ప్రయత్నం చేసాడు. అది వెలగడంలేదు. ఇంకొకడొచ్చి మొదటి వాడికి వెలిగించడంలో సహాయం చేసాడు. అయినా వెలగలేదు… కొంచెం అంటుకొని ఆగి పోయింది.
రెండో వాడికి విసుగొచ్చి “అదింక కాలదు లేరా! “ అని దాన్ని ప్రక్కకి తన్నేసి వేరే చిచ్చు బుడ్డి పెట్టి వెలిగించాడు. తన్నబడిన చిచ్చుబుడ్డి వచ్చి నరిసికి కొంచెం దూరంలో పడింది. దాన్నే చూస్తున్నాడు ముత్యం. ఇంతలో రెండోది వెలగడంతో పైకి ఎగుస్తున్న రవ్వల్నే ఆశ్చర్యంతో చూసాడు.
టపాకాయలు కాల్చే వాళ్ళు ముందుకు నడవడంతో మేళగాళ్ళు ముందుకు సాగారు. ముత్యం, కాలక ఆగిపోయిన చిచ్చుబుడ్డి వైపు చూస్తున్నాడు.
ఇంతలో రధం ముందుకు వచ్చింది. ముత్యం ని ఎత్తు కొనే రధం పైన ఉన్న దేవుడిని చూపించడానికి ముందుకు వచ్చింది నరిసి. వేలు పెట్టి చూపిస్తూ “ అదిగో అటు సూడు. ఆయనే దేవుడు,సేతులెత్తి దణ్ణం పెట్టు. కాపాడు తండ్రీ అనుకో” అని పిల్లడిచేత జోత పెట్టించి, “కనిపించిండా” అని అడిగింది.
కనిపించాడన్నట్టు తల ఊపాడు ముత్యం.
రధం కనుమరుగయ్యేంత వరకు అక్కడే ఉండి తర్వాత గుడిసె లోకి వచ్చింది.
లోపలికి వచ్చేటప్పుడు కూడా ముత్యం, సగం కాలిన చిచ్చుబుడ్డినే చూసుకుంటూ వచ్చాడు.
ముత్యం ని క్రిందికి దింపు తుంటే వెనక ఎవరో వచ్చిన అలికిడి అయి వెనక్కి చూసింది. వచ్చిన వ్యక్తిని చూసి తన కళ్ళని తనే నమ్మలేక పోయింది.
వచ్చింది నరిసి తండ్రి.
ఒక్క సారిగా దు:ఖం, సంతోషం పొంగుకొచ్చినయ్ . పరుగునవెళ్ళి తండ్రి గుండె మీద వాలి పోయింది.
ఇద్దరి మధ్య మాటలు కరువయినాయి. కూతుర్ని పొదివి పట్టుకున్నాడు.
అతని కళ్ళు వర్షిస్తున్నయ్ .
నరిసి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆయన గుండెల మీద.
వారి మధ్య మౌనమే సంభాషించింది.
“నన్ను క్షమించు నాన్నా. నా స్వార్ధం మాత్రమే చూసుకున్నాను.”
“చిన్న దానివి నువ్వు తప్పు చేసినా పెద్ద మనసు చేసుకొని నిన్ను క్షమించక పోవడం నా తప్పేనమ్మా!”
ఇద్దరిలో ఆనందం… పశ్చాత్తాపం.
కొద్ది సేపటికి తండ్రే తేరుకొని, “ఆడేనా నా మనవడు.. ఏడి? ఎక్కడ?” అన్నాడు.
“బయట కెళ్ళినట్టుండు… తెస్తా ఉండు” అంటూ బయట కొచ్చి, “ ముత్తెం! మీ తాత రా.. పిలుస్తుండు , రా ఇటు..” అని అరిచినట్టుగా పిలిచింది.
బయట, కాలని ఆ చిచ్చుబుడ్డిని పరిక్ష గా చూస్తున్న ముత్యం దాన్ని చేత బుచ్చుకొని నరిసి దగ్గర కొచ్చాడు. వాడి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తూంటే ఒక్కసారి గా చిచ్చుబుడ్డీ లోంచి రవ్వలు రావడంతో భయపడి వదిలేసాడు ముత్యం.
ఆ రవ్వలు నరిసి చీరెకి అంటుకొని మంటలు లేచినయ్ . ముత్యం భయంతో తాత కాళ్ళని చుట్టేసుకున్నాడు.
నరిసి తండ్రికి ఏంజరుగుతోందో తెలిసే లోపే చిచ్చుబుడ్డి రవ్వలు ఎగిరి గుడిసెకి తాకినయ్ .
“నాయనా! నువ్వు ముత్తెం ని తీసుకొని బయటకి పో..-” అని పెద్దగా అరిచింది. ఆయన భుజం మీది కండువాతో మంటలార్పడానికి ప్రయత్నిస్తుంటే అదికూడా అంటుకుంది.
నరిసి పిల్లాడిని ఎత్తి ఆయన చేతుల్లో పెట్టి “నువు పో నాయనా బయటకి” అని ఆయన్ని బయటకి తోసింది.
ముత్యం ని ఎత్తుకొని సహాయం కోసం పెద్దగా అరుస్తూ రోడ్డు మీద కొచ్చాడు నరిసి తండ్రి.
మంటలు ఎక్కువై గుడిసె ని పూర్తిగా ఆక్రమించినయ్ .
లోపల నరిసి కట్టుకున్న చీరె వంటికి అతుక్కొపోయి తగల బడుతోంది.
నరిసి మంటలని ఆపే ప్రయత్నం చేయలేదు.
తండ్రి చేతుల్లో తన ముత్యం భద్రంగా ఉండడం చూసుకుంది.
“దేవుడు రధం దిగి వచ్చి తన తండ్రి రూపంలో ముత్యాన్ని ఆదుకున్నాడు” అనుకుంది.
!!!!!!!!!!!!!!!!

Comments
Post a Comment